Page Loader
WhatsApp: వాట్సప్‌లో చాట్ థీమ్స్ ఫీచర్, 30 కొత్త వాల్‌పేపర్‌లు విడుదల
వాట్సప్‌లో చాట్ థీమ్స్ ఫీచర్

WhatsApp: వాట్సప్‌లో చాట్ థీమ్స్ ఫీచర్, 30 కొత్త వాల్‌పేపర్‌లు విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తక్షణ సందేశాలను పంపేందుకు, ఫోటోలు పంచుకునేందుకు మొదట గుర్తుకు వచ్చే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp). ఈ యాప్ యూజర్ల కోసం నిరంతరం కొత్త ఫీచర్లు, అప్‌డేట్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. తాజాగా, చాట్ థీమ్‌ను కస్టమైజ్ చేసుకునే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చాట్‌లకు అనేక రకాల థీమ్‌లను జోడించుకోవచ్చు. ఇందులో 30 రకాల వాల్‌పేపర్ ఎంపికలు ఉన్నాయి. అంతేకాకుండా, మీ కెమెరాతో తీసుకున్న ఫొటోలను కూడా చాట్ థీమ్‌గా సెటప్ చేసుకోవచ్చు. అదనంగా, చాట్ బబుల్‌ల రంగులను మార్చుకునే సౌలభ్యం కూడా లభిస్తోంది. సాధారణంగా వాట్సాప్‌లో మనం పంపే సందేశాలు ఆకుపచ్చ రంగులో, మనకు పంపబడే సందేశాలు తెలుపు రంగులో ఉంటాయి.

వివరాలు 

చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ ఫీచర్‌

ఈ కొత్త ఫీచర్ ద్వారా వాటిని కూడా మీకు నచ్చిన రంగుల్లో మార్చుకోవచ్చు. యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు, చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఒకే థీమ్‌ను అన్ని చాట్‌లకు వర్తింపజేయవచ్చు లేదా ప్రత్యేకంగా కొన్ని వ్యక్తుల చాట్‌లకు మాత్రమే అమర్చుకోవచ్చు. అయితే ఈ థీమ్ మీకు మాత్రమే కనిపించనుంది. వాట్సాప్ ఛానళ్లను నిర్వహించే వారు కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ సెట్టింగ్‌ను మార్చడానికి Settings > Chats > Default Chat Theme లోకి వెళ్లి అప్‌డేట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మీ యాప్‌ను అప్‌డేట్ చేసుకొని ఈ కొత్త థీమ్ ఫీచర్‌ను మీరు కూడా ప్రయత్నించండి!