
WhatsApp: వాట్సాప్ కొత్త 'సేఫ్టీ ఓవర్ వ్యూ' ఫీచర్.. గ్రూప్ స్క్యామ్‌లపై ముందస్తు హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ తాజాగా ఓ కొత్త భద్రతా ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీనివల్ల ఎవరో తెలియని వ్యక్తులు రూపొందించిన గ్రూప్‌లలో యూజర్లను ఉద్దేశపూర్వకంగా జోడించకుండా జాగ్రత్త పడవచ్చు. 'సేఫ్టీ ఓవర్ వ్యూ' అనే ఈ కొత్త ఫీచర్ ద్వారా, ఎవరో తెలియని కాంటాక్ట్‌లు సృష్టించిన గ్రూపులపై పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఉదాహరణకి ఆ గ్రూప్ పేరు, దాన్ని ఎవరు సృష్టించారో, ఇంకా అందులో ఉన్న మెంబర్ల వివరాలు కూడా చూపిస్తుంది.
వివరాలు
ఏదైనా అనుమానాస్పద గ్రూప్ అయితే..
ఈ ఫీచర్ ద్వారా, ఎవరో తెలియని వ్యక్తి సృష్టించిన గ్రూప్‌ని ఓపెన్ చేసేముందు ఓ రివ్యూ స్క్రీన్ వస్తుంది. అందులో గ్రూప్ పేరు, క్రియేటర్ ఎవరో, సభ్యుల వివరాలు ఉంటాయి. అవి చూసి, అది నిజమైనదా లేక స్క్యామ్‌కై సృష్టించిందా అనేది యూజర్ అంచనా వేసుకోవచ్చు. అవసరమైతే మెసేజ్‌లు చూడకుండానే ఆ గ్రూప్ నుంచి బయటపడొచ్చు. ఇక అదే నిజమైన గ్రూప్ అనిపిస్తే, అప్పుడు గ్రూప్ చాట్ ఓపెన్ చేసి పూర్తి విషయాన్ని తెలుసుకోవచ్చు. అంతవరకు ఆ గ్రూప్ నుంచి నోటిఫికేషన్లు మ్యూట్ అయిపోతాయి.
వివరాలు
అన్నివేళలా అపరిచితులతో జాగ్రత్త..
WhatsApp ఇంకో కొత్త భద్రతా ఫీచర్‌పై పని చేస్తోంది. అది ఏంటంటే - మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తికి మెసేజ్ పంపేముందే వార్నింగ్ ఇవ్వడం. ఇది స్క్యామర్లు ఇతర ప్లాట్‌ఫాంల ద్వారా మొదటగా పరిచయం అవుతూ, తర్వాత WhatsAppకి మార్చమని చెబుతుంటారు కదా - అలాంటి సందర్భాల్లో మోసపోవకుండా ఉండేందుకు ఈ ఫీచర్ సహాయపడుతుంది.
వివరాలు
WhatsApp సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
ప్రైవసీ చెకప్: ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలొ,ఆన్‌లైన్ status చూసేలా ఉండాలొ,గ్రూప్‌కి యాడ్ చేయాలొ వంటి సెట్టింగ్స్‌ను మీరు అనుకూలంగా మార్చుకోవాలి. టూ-స్టెప్ వెరిఫికేషన్: అకౌంట్ హ్యాక్ కాకుండా ఉండేందుకు ఈ ఫీచర్ తప్పక ఎనేబుల్ చేసుకోవాలి. బ్లాక్ & రిపోర్ట్: అనుమానాస్పద ఖాతాలను వెంటనే బ్లాక్ చేసి,వాటిని WhatsAppకి రిపోర్ట్ చేయాలి. కాంటాక్ట్ కార్డ్స్ చదవండి:ఏ అపరిచిత వ్యక్తి మెసేజ్ పంపితే - కాంటాక్ట్ కార్డ్‌ని పూర్తిగా చదివి, బాగానే ఆలోచించి స్పందించాలి. అపరిచిత కాల్స్ మ్యూట్ చేయండి:కాల్ ఆధారంగా వచ్చే స్క్యామ్‌లను నివారించేందుకు ఈ ఆప్షన్‌ను ఓన్ చేయండి. అధికారిక యాప్ మాత్రమే వాడండి: WhatsApp నకిలీ వెర్షన్లు వాడితే అకౌంట్ ప్రమాదంలో పడొచ్చు. కాబట్టి అధికారిక యాప్‌నే వాడాలి.