
WhatsApp Voice Chat: వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌తో వినియోగదారులకు సర్‌ప్రైజ్!
ఈ వార్తాకథనం ఏంటి
మెటా సంస్థ ఓ ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ తాజాగా ఒక కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. దీనిలో కొత్తగా 'వాయిస్ చాట్' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ సభ్యులు లైవ్ ఆడియోలో పరస్పరం మాట్లాడుకోవడం, అదే సమయంలో గ్రూప్ చాట్‌లో మెసేజ్‌లను కూడా కొనసాగించుకోవడం సాధ్యం అవుతుంది.
Details
వాయిస్ చాట్ ఎలా పనిచేస్తుంది?
ముందుగా, వాయిస్ చాట్ ఫీచర్ 33 మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా దీనిని 256 సభ్యుల గ్రూపుల్లో వాడుకోవడానికి విస్తరించారు.
అంటే ఏ గ్రూప్ సభ్యుడు అయినా వాయిస్ చాట్‌ను ప్రారంభించవచ్చు. ఈ వాయిస్ చాట్ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ఇతరులకు నోటిఫికేషన్ వెళ్లదు.
అయితే ఎవరికైనా అవసరమైతే ఎప్పుడైనా వాయిస్ చాట్‌లో చేరవచ్చు లేదా ఎప్పుడైనా వాయిస్ చాట్ నుంచి బయలుదేరవచ్చు.
వాయిస్ చాట్ ప్రారంభించిన వెంటనే అది గ్రూప్ చాట్ దిగువ భాగంలో కనిపించి, అక్కడ ఎవరు ఉన్నారో చూడవచ్చు.
ఇది పూర్తిగా ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్‌తో పనిచేస్తుంది. అలాగే సాధారణ వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ల లాగా ఇది కూడా పూర్తి గోప్యతతో ఉంటుంది.
Details
వాయిస్ చాట్ ఎలా ప్రారంభించాలి?
ముందుగా గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి.
పైభాగంలోని వాయిస్ చాట్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి.
ఆ తరువాత "Start Voice Chat" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఈ సమయంలో ఇతరులకు కాల్ బదులుగా పుష్ నోటిఫికేషన్ మాత్రమే అందుతుంది.
వాయిస్ చాట్‌లో ఎవరెవరు ఉన్నారో చూపించే బ్యానర్ చాట్ దిగువ భాగంలో కనిపిస్తుంది.
Details
అదనపు సౌకర్యాలు
వాయిస్ చాట్‌లో లేనపటికీ, గ్రూప్ హెడర్ లేదా కాల్స్ ట్యాబ్‌లో ఎవరెవరు వాయిస్ చాట్‌లో ఉన్నారో చూసుకోవచ్చు.
అలాగే, గ్రూప్ మెసేజ్‌లు, కాల్ అలర్ట్‌లను మ్యూట్ చేసే ఆప్షన్ కూడా ఈ ఫీచర్‌లో ఉంది.
వాయిస్ చాట్‌లో ఎవరూ జాయిన్ కాకపోతే లేదా ఒక గంటపాటు వాయిస్ చాట్ లో సభ్యులు లేకపోతే అది ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది.
వాయిస్ చాట్ నుండి బయటకు రావాలంటే "Leave Voice Chat"ను ట్యాప్ చేయాలి.
Details
రిలీజ్ షెడ్యూల్
వాట్సాప్ ఈ వాయిస్ చాట్ ఫీచర్‌ను త్వరలోనే గ్లోబల్ స్థాయిలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచనుందని ప్రకటించింది.
ఇప్పటి వరకు గ్రూప్ కమ్యూనికేషన్స్‌లో మెసేజ్‌లకు పరిమితమై ఉన్న వాట్సాప్, ఈ కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌తో మరింత ఇంటరాక్టివ్ అవుతుందనేది వినియోగదారుల అంచనా.