
WhatsApp new feature: అవతలి వ్యక్తులు మీడియాను సేవ్ చేయకుండా.. వాట్సప్ కొత్త ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ ద్వారా మనం ఎవరికి ఫోటోలు లేదా వీడియోలు పంపినా, అవి వారు తమ గ్యాలరీలో నిల్వ చేసుకోవచ్చు.
అయితే, అవతలి వారు వాటిని సేవ్ చేసుకోకుండా అడ్డుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది?
ఇప్పుడు ఈ సదుపాయాన్ని వాట్సప్ అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు మరికొన్ని ప్రైవసీకి సంబంధించిన ఫీచర్లను కూడా తీసుకురావడానికి వాట్సప్ సిద్ధమవుతోంది అని వాట్సప్ అప్డేట్స్‌పై నిఘా వేసే వాబీటా ఇన్ఫో వెల్లడించింది.
వివరాలు
ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది
వాట్సప్ ఆండ్రాయిడ్ యాప్‌లో త్వరలో రాబోయే ఫీచర్ ద్వారా, ఫోటోలు లేదా వీడియోలు పంపేటప్పుడు అవతలి వ్యక్తి వాటిని గ్యాలరీలో సేవ్ చేసుకోకుండా నియంత్రించగలిగే ఎంపికను యూజర్లకు ఇవ్వనుంది.
ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ సెట్టింగ్‌ను యాక్టివేట్ చేసినప్పుడు, మెసేజ్ అందుకునే వ్యక్తి ఆ ఫోటో లేదా వీడియోను సేవ్ చేయాలని ప్రయత్నించినప్పుడు 'సేవ్ చేయడం సాధ్యపడదు' అనే మెసేజ్ కనిపిస్తుంది.
అదే సెట్టింగ్ ఆఫ్ చేస్తే, వారు సేవ్ చేసుకోవచ్చు. వన్‌టైమ్ వ్యూ ఆప్షన్ ద్వారా కూడా ఇదే ఫలితం లభించవచ్చు, కానీ అలాంటి మీడియాను వారు కేవలం ఒక్కసారి మాత్రమే చూడగలుగుతారు.
వివరాలు
హిస్టరీ ఎక్స్‌పోర్ట్ విషయంలోనూ కొత్త ప్రైవసీ ఫీచర్
ఇంకా, చాట్ హిస్టరీ ఎక్స్‌పోర్ట్ విషయంలోనూ కొత్త ప్రైవసీ ఫీచర్‌ను వాట్సప్ ప్రవేశపెట్టబోతోంది.
"అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ" అనే సెట్టింగ్ యాక్టివేట్ చేసిన తరువాత, మెసేజ్ పొందే వ్యక్తి ఆ చాట్‌ను ఎక్స్‌పోర్ట్ చేయలేరు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిస్‌అపియరింగ్ మెసేజ్‌లు ఫీచర్ ద్వారా నిర్ణీత సమయం తరువాత సందేశాలు ఆటోమేటిక్‌గా డిలీట్ కావచ్చు.
అయితే కొత్త ఫీచర్ దీనికంటే భిన్నంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్లు ఇప్పటికీ అభివృద్ధి దశలో ఉన్నాయని, బీటా ప్రోగ్రామ్‌లో భాగమైన వినియోగదారులకూ ఇంకా అందుబాటులో లేవని వాబీటా ఇన్ఫో తెలియజేసింది.