త్వరలో ప్రైవేట్ న్యూస్ లెటర్ టూల్ ను ప్రారంభించనున్న వాట్సాప్
WABetaInfo ప్రకారం, వాట్సాప్ "న్యూస్‌లెటర్" అనే కోడ్‌నేమ్‌తో ఉన్న కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. న్యూస్‌లెటర్ పరిశ్రమ చిన్నది కానీ అభివృద్ధి చెందుతున్నది. అయితే, COVID-19 మహమ్మారి వలన దాని వృద్ధి మందగించింది. ఈ మెసేజింగ్ యాప్ వినియోగదారులకు ఉత్తమ న్యూస్ లెటర్ అనుభవాన్ని అందించగలదు. ప్రస్తుతం వాట్సాప్ న్యూస్ లెటర్ గురించి ఎక్కువ సమాచారం లేదు. WABetaInfo ప్రకారం, ఇది అన్నీ రకాల సమాచారాన్ని ప్రసారం చేసే టూల్ లాగా ఉంటుంది. గ్రూప్స్ లేదా కాంటాక్ట్ నుండి అప్డేట్ పొందడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. యాప్ లో ఇతర ఫీచర్ల లాగా కాకుండా, న్యూస్‌లెటర్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండదు.
వినియోగదారులు వారు ఎంచుకున్న కంటెంట్‌ను మాత్రమే చూడగలరు
న్యూస్‌లెటర్ స్టేటస్ ట్యాబ్ కింద స్పెషల్, ఆప్షనల్ విభాగంలాగా ఉంటాయి. న్యూస్ లెటర్ కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేనప్పటికీ, సబ్‌స్క్రైబర్‌ల, క్రియేటర్‌ల ఫోన్ నంబర్‌లు కనపడవు. వినియోగదారులు తాము చూసే న్యూస్ లెటర్స్ ను ఎప్పుడైనా, ఎవరినుండైనా చూసేలా ఆప్షన్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ హ్యాండిల్‌లకు సపోర్ట్ ఇస్తుంది, వినియోగదారులు తమ అభిమాన క్రియేటర్ల కోసం వెతకడాన్ని సులభం చేస్తుంది. ఎవరైనా ఎవరిని అనుసరిస్తున్నారో ఎవరూ చూడలేరు. వాట్సాప్ న్యూస్ లెటర్స్ లో ఎటువంటి ప్రకటనలు ఉండవు, అయితే, భవిష్యత్తులో ప్రకటనలను ప్రదర్శించే అవకాశం ఉంది. వినియోగదారులు వారు ఎంచుకున్న కంటెంట్‌ను మాత్రమే చూడగలరు. కంటెంట్ ఏదైనా వాట్సాప్ చాట్ లాగా సమయం ప్రకారం కనిపిస్తుంది.