LOADING...
Surya grahan 2025: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎప్పుడంటే..? భారతదేశానికి ప్రభావం ఉందా?
ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎప్పుడంటే..? భారతదేశానికి ప్రభావం ఉందా?

Surya grahan 2025: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎప్పుడంటే..? భారతదేశానికి ప్రభావం ఉందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 సంవత్సరంలో ఏర్పడనున్న రెండవ సూర్య గ్రహణం కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది ఖగోళంలో అరుదుగా చోటుచేసుకునే ముఖ్యమైన సంఘటనల్లో ఒకటి. 2025 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. వాటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలుగా ఉంటాయి. ఇప్పటివరకు ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం జరుగగా.. మిగిలిన రెండు ఈ ఏడాది చివర్లో ఏర్పడనున్నాయి. వాటిలో ఒకటి సెప్టెంబర్‌లో ఏర్పడనున్న సూర్యగ్రహణం.

Details

సూర్యగ్రహణం అంటే ఏమిటి?

సూర్యుని, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా భాగంగా కప్పేస్తాడు. దీనివల్ల కొంతసేపు భూమిపైకి సూర్యకాంతి రాకుండా అవుతుంది. ఈ ఖగోళ దృశ్యాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇది సాధారణంగా అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. అటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

Details

సెప్టెంబర్‌లో ఏర్పడనున్న సూర్యగ్రహణ వివరాలు

భారత కాలమానం ప్రకారం, ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 11:00 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:24 గంటలకు ముగియనుంది. మొత్తం గ్రహణ వ్యవధి 4 గంటల 24 నిమిషాలు. ఇది పాక్షిక సూర్యగ్రహణం అవుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనబడదు. అయితే న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికా, ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. భారతదేశంలో ఇది కనిపించకపోవడంతో, సుతక నియమాలు దేశంలో వర్తించవు. సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ సూర్యగ్రహణం, 2025లో చివరిది కానుంది.