LOADING...
Solar Eclipse: సెప్టెంబర్ 21ప సూర్య గ్రహణం భారత్‌లో కనిపిస్తుందా? పూర్తి వివరాలు ఇక్కడే!
సెప్టెంబర్ 21ప సూర్య గ్రహణం భారత్‌లో కనిపిస్తుందా? పూర్తి వివరాలు ఇక్కడే!

Solar Eclipse: సెప్టెంబర్ 21ప సూర్య గ్రహణం భారత్‌లో కనిపిస్తుందా? పూర్తి వివరాలు ఇక్కడే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

2025 సెప్టెంబర్‌ 21వ తేదీన మహాలయ అమావాస్య రోజున పాక్షిక సూర్య గ్రహణం (Surya Grahan 2025) సంభవించనుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదని ఖగోళ శాస్త్రజ్ఞులు, పండితులు చెబుతున్నారు. భారత్‌తో పాటు పాకిస్తాన్‌, శ్రీలంక, నేపాల్‌, ఆఫ్ఘనిస్తాన్‌, నార్త్‌ అమెరికా వంటి ప్రాంతాల్లో కూడా ఇది కనిపించదు. ఈ సూర్య గ్రహణం కేవలం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, అట్లాంటిక్‌, న్యూజిలాండ్‌, పసిఫిక్‌ మహాసముద్రం ప్రాంతాల్లో మాత్రమే దర్శనమిస్తుంది. భారత కాలమానం ప్రకారం, ఈ పాక్షిక గ్రహణం సెప్టెంబర్‌ 21 రాత్రి 10.59 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్‌ 22 తెల్లవారుజామున 3.23 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో సూర్యుని సుమారు 85 శాతం భాగం చంద్రుడి వెనుక దాగిపోతుంది.

Details

ఆధ్యాత్మిక ప్రాధాన్యం

పండితుల ప్రకారం, ఈ గ్రహణ కాలం యోగులు, ఆధ్యాత్మిక సాధకులకు విశేషమైన సమయం. ఈ సమయంలో చేసే జపం, ధ్యానం, దానం మరింత ఫలప్రదంగా ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు, ఈ గ్రహణం సింహరాశిలోనే జరుగుతుందని కొందరు, కన్యరాశిలో జరుగుతుందని మరికొందరు పండితులు పేర్కొంటున్నారు. అందువల్ల సింహ, కన్యరాశి వారు గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని సూచిస్తున్నారు. సముద్రంలో ప్రభావం ఈ గ్రహణం ఎక్కువగా సముద్ర ప్రాంతాల్లో కనబడనుండటంతో, సముద్రంలో అలజడి ఏర్పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం కావడం.

Details

పితృ పక్షం ముగింపు - బతుకమ్మ ప్రారంభం

ఈ ఏడాది పితృ పక్షాలు సెప్టెంబర్‌ 7న ప్రారంభమై, సెప్టెంబర్‌ 21న మహాలయ అమావాస్య రోజున ముగుస్తాయి. హిందూ సంప్రదాయంలో పితృ పక్షాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ 15 రోజుల పాటు పూర్వీకులను స్మరించుకుంటూ పితృకార్యాలు చేస్తారు. అదే రోజు (సెప్టెంబర్‌ 21) నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగలో గౌరీ దేవిని 9 రోజుల పాటు, 9 విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు.