LOADING...
Microsoft: మైక్రోసాఫ్ట్ యూజర్లకు భారీ షాక్.. విండోస్ 10 అప్‌డేట్స్ నిలిపివేత.. వెంటనే విండోస్ 11కి మారండి
వెంటనే విండోస్ 11కి మారండి

Microsoft: మైక్రోసాఫ్ట్ యూజర్లకు భారీ షాక్.. విండోస్ 10 అప్‌డేట్స్ నిలిపివేత.. వెంటనే విండోస్ 11కి మారండి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ అక్టోబర్ 2025 నుంచి విండోస్ 10కి ఇచ్చే మద్దతును పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి విండోస్ 10 పై ఎటువంటి ఉచిత భద్రతా అప్ డేట్లు కాని, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లభించవని తెలిపింది. ఈ వార్త మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు పెద్ద షాక్‌ను కలిగించింది. ఎందుకంటే భద్రతా అప్‌డేట్లు లేకపోతే కంప్యూటర్‌కి హ్యాకర్లు, మాల్వేర్‌లు, వైరస్‌లు సహజంగా దాడి చేయడం సులభమవుతుంది అని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. అందుకే విండోస్ 10 ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు ఈ విషయం గమనించాల్సివుంది.

వివరాలు 

30 డాలర్ల చెల్లింపుతో పాటు రెండు ప్రత్యామ్నాయ మార్గాలు 

ఈ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కోవడం కోసం మైక్రోసాఫ్ట్ కొన్ని ప్రత్యేక అవకాశాలను కూడా ప్రకటించింది. సాధారణ వినియోగదారులు తమ విండోస్ 10 పరికరాలకు భద్రతా అప్‌డేట్లు కొనసాగించాలనుకుంటే, సంవత్సరానికి 30 డాలర్ల చెల్లింపుతో అదనపు భద్రతా అప్‌డేట్లు 2026 అక్టోబర్ వరకు పొందవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ రూపొందించిన కొత్త ప్రోగ్రామ్. అయితే, చాలా మంది వినియోగదారులు ఈ ఆఫర్‌ను అన్యాయమైనదని, ఎందుకంటే ఇప్పటివరకు విండోస్ 10కి భద్రతా అప్‌డేట్లు ఉచితంగా లభించేవని అభిప్రాయపడుతున్నారు. 30 డాలర్ల చెల్లింపుతో పాటు రెండు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. విండోస్‌లోని బ్యాకప్ యాప్ ఉపయోగించి మీ ముఖ్యమైన ఫైళ్లను OneDriveలో నిల్వ చేసుకోవడం.

వివరాలు 

పాత పరికరాలు Windows 11కి అప్‌గ్రేడ్ కాలేనటువంటి పరిస్థితులు

ఇది మీ డేటాను భద్రపరచడంలో సహాయపడుతుంది. రెండవది.. Microsoft Rewards పాయింట్లు కలిగినవారు 1000 పాయింట్లను రీడీమ్ చేసుకొని అదనపు భద్రతా అప్‌డేట్లను పొందడం. అయితే, పబ్లిక్ ఇంటరెస్ట్ రీసెర్చ్ గ్రూప్ (PIRG) వంటి వినియోగదారు హక్కుల సంస్థలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. పాత పరికరాలు Windows 11కి అప్‌గ్రేడ్ కాలేనటువంటి పరిస్థితులు ఉండడం వల్ల, మిలియన్ల కొద్దీ మంచి కంప్యూటర్‌లు చెత్తకుప్పల్లోకి వెళ్లే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ, వ్యాపార సంస్థలు మైక్రోసాఫ్ట్ ద్వారా 3 సంవత్సరాల పొడిగించిన భద్రతా మద్దతు పొందుతున్నప్పటికీ, సాధారణ వినియోగదారులకు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే అందిస్తున్న విషయం సరైన నిర్ణయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

విండోస్ 10 యూజర్ల ముందు తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి

కొందరు సాంకేతిక నిపుణులు ఈ మద్దతును కనీసం రెండు లేదా మూడు సంవత్సరాలు అందించాలని, తద్వారా పాత పరికరాలను ఉపయోగించుకుంటూ భద్రతా సమస్యలు ఎదుర్కోవకుండా ఉంచవచ్చని అంటున్నారు. ఇప్పుడు విండోస్ 10 యూజర్ల ముందు తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 30 డాలర్ల చెల్లించి అదనపు భద్రతా అప్‌డేట్లు పొందడం,Microsoft Rewards పాయింట్లు ద్వారా భద్రతా మద్దతు పొందడం,లేక OneDriveలో డేటాను నిల్వ చేసుకోవడం వంటివి ప్రస్తుతం ఉన్న మార్గాలుగా ఉన్నాయి.

వివరాలు 

మీ పరికరాన్ని Windows 11కి అప్‌గ్రేడ్ చేయడం ఉత్తమ మార్గం

అయితే ఉత్తమ మార్గం..మీ పరికరాన్ని Windows 11కి అప్‌గ్రేడ్ చేయడం. అయితే, అన్ని పాత పరికరాలు Windows 11కి అనుకూలంగా ఉండవు.అందువల్ల,ముందుగా మీ కంప్యూటర్ Windows 11కు సపోర్ట్ ఇచ్చే విధంగా ఉన్నదో లేదో నిర్ధారించుకోవడం చాలా అవసరం. మొత్తానికి , భద్రతా అప్‌డేట్లు లేకపోవడం వల్ల గల ప్రమాదాలు భయంకరంగా ఉంటాయి. అందువల్ల వినియోగదారులు ముందుగానే తగిన చర్యలు తీసుకోవడం అత్యంత కీలకం.