
Japan: జపాన్‌లో కేవలం 6 గంటల్లోనే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D-ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో తొలిసారిగా, 3డీ ముద్రణ (3D Printing) సాంకేతికతను ఉపయోగించి కేవలం ఆరు గంటల్లో రైల్వే స్టేషన్‌ను నిర్మించిన ఘనత జపాన్‌కు చెందిన ఒక నిర్మాణ సంస్థ సాధించింది.
అంతర్జాతీయ వార్తా వర్గాల ప్రకారం, జపాన్‌లోని హట్సుషిమా ప్రాంతంలో 'సెరెండిక్స్' అనే నిర్మాణ సంస్థ 3D-ప్రింటెడ్ భాగాలతో ఒక రైల్వే స్టేషన్‌ను నిర్మించింది.
రాత్రి చివరి రైలు వెళ్లిన తరువాత, ఉదయం మొదటి రైలు వచ్చేలోపే ఈ నిర్మాణం పూర్తయ్యింది.
ఈ విధంగా, ప్రపంచంలో ఈ అరుదైన విజయాన్ని సాధించిన మొదటి సంస్థగా సెరెండిక్స్ నిలిచింది.
వివరాలు
100 చదరపు అడుగుల కంటే కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో స్టేషన్
వెస్ట్ జపాన్ రైల్వే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం,అరిడా అనే ప్రాంతంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్‌కు గంటకు మూడుసార్లు రైళ్లు వస్తూ ఉంటాయి.
రోజంతా అనేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉంటాయి.
స్థల పరిమితి తక్కువగా ఉండటం వల్ల,కేవలం 100 చదరపు అడుగుల కంటే కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో ఈ స్టేషన్‌ను నిర్మించారు.
రాత్రి 11:57 గంటలకు చివరి రైలు వెళ్లిపోయిన వెంటనే నిర్మాణ బృందం 3D-ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి కొత్త స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించింది.
క్రేన్ సాయంతో ఈ నిర్మాణాన్ని ఎత్తి, పాత స్టేషన్ పక్కనే స్థాపించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయి, ఉదయం 5:45 గంటలకు మొదటి రైలు వచ్చేలోపు కొత్త స్టేషన్ సిద్ధంగా ఉంది.
వివరాలు
జులై నెలలో పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి..
అయితే ప్రస్తుతానికి ఈ స్టేషన్ తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకురాగా, ఇంకా కొన్ని అంతర్గత పనులు, టికెట్ యంత్రాల వంటి పరికరాల ఏర్పాటు మిగిలి ఉంది.
అన్ని సదుపాయాలు పూర్తయ్యాక, ఈ కొత్త భవనాన్ని జులై నెలలో పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ తరహా 3డీ నిర్మాణ విధానం వల్ల సమయం, ఖర్చు రెండూ తక్కువ అయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా జపాన్‌లో పనిచేసే కార్మికుల కొరత ఎక్కువగా ఉండటంతో, ఈ సాంకేతికత అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపాన్ 6 గంటల్లో 3D-ప్రింటెడ్ రైలు స్టేషన్‌ను ఎలా నిర్మించింది?
How Japan Built a 3D-Printed Train Station
— Spiros Margaris (@SpirosMargaris) April 8, 2025
in 6 Hours https://t.co/BIpSqp2eaW @nytimes pic.twitter.com/aVauplnIjp