Page Loader
తొలి ప్రయోగాన్ని పూర్తి చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ విమానం
ఇది ఇప్పటివరకు పరీక్షించబడిన అతిపెద్ద ZeroAvia ఇంజిన్

తొలి ప్రయోగాన్ని పూర్తి చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ విమానం

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 20, 2023
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ZeroAvia, ఒక బ్రిటిష్-అమెరికన్ హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ డెవలపర్, ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 19-సీట్ల, ట్విన్-ఇంజిన్ డోర్నియర్ 228 విమానంకు ఒక నమూనా హైడ్రోజన్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ ను అమర్చారు. UKలోని గ్లౌసెస్టర్‌షైర్‌లోని కాట్స్‌వోల్డ్ విమానాశ్రయం నుండి 10 నిమిషాల ప్రయాణాన్ని ఈ విమానం పూర్తి చేసింది. తొలి టెస్ట్ ఫ్లైట్ విజయం విమానయాన రంగంలో మార్పుని తీసుకొచ్చే అవకాశముంది. ఈ ప్రయోగం 2025కి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్‌ను మాత్రమే ఉపయోగించి వాణిజ్య విమానాలను నడపాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ సంస్థను ఒక అడుగు ముందుకు వేయించింది. ట్విన్-ఇంజిన్ ZeroAvia ఎడమ వైపున హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో అమర్చారు. కుడి వైపున హనీవెల్ TPE-331 స్టాక్ ఇంజన్ పెట్టారు.

విమానం

HyFlyer II ప్రాజెక్ట్‌లో ఒక భాగమే ఈ టెస్ట్ ఫ్లైట్

టెస్ట్ ఫ్లైట్ HyFlyer II ప్రాజెక్ట్‌లో ఒక భాగం, ఇది UK ప్రభుత్వం ATI ప్రోగ్రామ్ ద్వారా నిధులు అందించిన R&D ప్రోగ్రామ్. ఇది పర్యావరణ అనుకూల చిన్న విమానాలను అభివృద్ధి చేయడంలో పని చేస్తుంది. పరీక్షించే సమయంలో, హైడ్రోజన్ ట్యాంకులు, ఫ్యూయల్ సెల్ పవర్ జనరేషన్ సిస్టమ్‌లు క్యాబిన్‌లో ఉంచారు. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం, సీటింగ్ కోసం స్థలం ఉండాలి కాబట్టి అవి బయట పెడతారు. "మా 19-సీట్ ఎయిర్‌క్రాఫ్ట్ మొదటి ఫ్లైట్ మాటెక్నాలజీ ఎంత పటిష్టంగా ఉందో చూపిస్తుంది" అని ZeroAvia వ్యవస్థాపకుడు వాల్ మిఫ్తాఖియోవ్ అన్నారు. జీరో క్లైమేట్ ఇంపాక్ట్ ఏవియేషన్ భవిష్యత్తును నిర్మిస్తున్నామని, క్లీన్ ఏవియేషన్‌ను వేగవంతం చేయడానికి ఉత్తమ పరిష్కారం కనుగొంటున్నామని ఆయన అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టెస్ట్ ఫ్లయిట్ ఫుటేజీని చూడండి