X Premium : మరోసారి ఉత్కంఠ రేపిన ఎలాన్ మస్క్.. తక్కువ ధరకే 'ఎక్స్' ప్రీమియం ఫీచర్లు
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'X' ఎక్స్ ప్రీమియంలో రెండు రకాల సబ్‌స్క్రిప్షన్లను తీసుకొస్తున్నామని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ శుక్రవారం ప్రకటన చేశారు. సామాజిక మాధ్యమ దిగ్గజం 'ఎక్స్'ను కొనుగోలు చేసినప్పట్నుంచి మెగా బిలియనీర్ ఎలాన్ మస్క్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆ మార్పుల పరంపరను కొనసాగిస్తూ తాజాగా మరో కీలక అప్‌డేట్‌ను ప్రవేశపెట్టారు. ప్రీమియం పెయిడ్ సర్వీస్‌లో రెండంచెల వ్యవస్థను లాంఛ్ చేయనున్నామన్నారు. ఇకపై రెండు రకాల ప్రీమియం ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తేనునట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎక్స్ ప్రీమియం సేవల కోసం నెలకు 8 డాలర్లను చెల్లించాల్సి వస్తోంది. అయితే భారత్‌లో ఇది రూ.900గా చెల్లిస్తున్నారు. కొత్తగా రానున్న ప్రీమియం ధరలు తక్కువ ధరకే తీసుకురానున్నారు.
యాడ్స్ వచ్చినా ఓకే అనుకుంటే ప్రీమియం ఫీచర్ల ప్యాక్ ఉత్తమం
కానీ అందులో వాణిజ్య ప్రకటనలు (Ads) ఉంటాయి. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వినియోగదారులే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు.ఇందులో యాడ్స్ వచ్చినా ఓకే అనుకుంటే ప్రీమియం ఫీచర్ల కోసం ఈ ప్యాక్‌ను పొందొచ్చు. కానీ ప్రీమియం ఫీచర్లలో మాత్రం అలా ఉండదు. ప్రకటనలు లేకుండానే సేవలు వినియోగించుకోవచ్చు. ఎలాంటి కోత ఉండదు. ఎక్స్ ప్రీమియంలో (X Premium) సబ్‌స్క్రిప్షన్ అంటే వాణిజ్య ప్రటనలు ఉండవు. ఈ ప్యాక్‌ను తీసుకున్నవారు ప్రీమియం ఫీచర్లతో సహా యాడ్‌లు లేని 'ఎక్స్'ను ఎంజాయ్ చేయొచ్చు. ప్రీమియం ఫీచర్లలో పోస్ట్ ఎడిట్, లాంగ్ పోస్ట్‌లు,యాప్ ఐకాన్‌లు, కస్టమ్ నావిగేషన్, సుదీర్ఘ వీడియో అప్‌లోడ్ వంటి సేవలను పొందేందుకు వీలుంది. కొత్త ప్రీమియం సేవల ధరలను ప్రకటించకపోవడం గమనార్హం.