Loading...
X Clipping Feature: వీడియో క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. ఎక్స్‌లో కొత్త క్లిప్పింగ్ ఫీచర్
వీడియో క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. ఎక్స్‌లో కొత్త క్లిప్పింగ్ ఫీచర్

X Clipping Feature: వీడియో క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. ఎక్స్‌లో కొత్త క్లిప్పింగ్ ఫీచర్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 11, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా క్రియేటర్లను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నంలో ఎక్స్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. క్లిప్పింగ్ టూల్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌తో పెద్ద వీడియోలో నచ్చిన భాగాన్ని కట్ చేసి ప్రత్యేక క్లిప్‌గా పోస్ట్ చేయొచ్చు. ఇప్పటివరకు ఇలాంటి పని కోసం బయట యాప్స్ లేదా ప్రత్యేక టూల్స్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఎక్స్‌లోనే వీడియోను ట్రిమ్ చేసి, మన అభిప్రాయాన్ని జోడించి నేరుగా పోస్ట్ చేయవచ్చు. దీంతో క్రియేటర్లకు కంటెంట్ తయారీ మరింత సులభం కానుంది.

Details

అసలు వీడియోకు కూడా లింక్

ఎక్స్ కొత్త క్లిప్పింగ్ విధానంలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. తయారు చేసిన ప్రతి క్లిప్‌పై "Clip from" అనే లేబుల్ కనిపిస్తుంది.

దానిపై క్లిక్ చేస్తే ఆ క్లిప్ తీసుకున్న అసలు వీడియోకు వెళ్లొచ్చు. అంటే ఒక క్రియేటర్ వీడియో నుంచి వైరల్ అయిన చిన్న క్లిప్ చూసిన వ్యక్తి.. వెంటనే ఒరిజినల్ వీడియోతో పాటు ఆ క్రియేటర్ ఇతర కంటెంట్‌ను కూడా చూడగలరు.

దీనివల్ల అసలు వీడియోకు కూడా అదనపు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది.

Details

క్లిప్స్‌తో సంపాదనకు అవకాశం

క్లిప్ రూపొందించిన వ్యక్తితో పాటు అసలు క్రియేటర్ కూడా దాని ద్వారా వచ్చే వ్యూస్‌పై Original Content Rewards కార్యక్రమం ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉందని ఎక్స్ తెలిపింది.

అయితే ఈ ప్రయోజనం అర్హత ఉన్న క్రియేటర్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఎంగేజ్‌మెంట్ స్థాయిని బట్టి రివార్డులు నిర్ణయిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పొడవైన వీడియోలను చిన్న చిన్న భాగాలుగా మార్చి వైరల్ చేయడం సాధారణంగా మారింది.

ఈ ట్రెండ్‌ను ఎక్స్ కూడా తన ప్లాట్‌ఫామ్‌లో మరింత పెంచాలని చూస్తోంది.

ADVERTISEMENT

Details

క్రియేటర్ల కోసం ఎక్స్‌ ప్లాన్ ఇదే

క్రియేటర్లను తనవైపు తిప్పుకునేందుకు ఎక్స్ గత కొంతకాలంగా వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.

2022లో లాంగ్‌ఫార్మ్ వీడియోలు, ఈ ఏడాది మార్చిలో Exclusive Threads, జూలైలో లైవ్‌స్ట్రీమింగ్ స్టూడియోను ప్రారంభించింది.

లైవ్‌ క్రియేటర్ల కోసం 1 మిలియన్ డాలర్లను కూడా కేటాయించింది. ఇప్పుడు క్లిప్పింగ్ ఫీచర్‌తో చిన్న వీడియో కంటెంట్‌కు మరింత ప్రాధాన్యం ఇస్తోంది.

ADVERTISEMENT