Xiaomi ప్యాడ్ 6 v/s OnePlus ప్యాడ్.. ఏది కొంటే బెటర్..?
షాయోమీ ఇండియాలో తన అండ్రాయిడ్ టాబ్లెట్ ను విస్తరించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 13న ఇండియన్ మార్కెట్లోకి షాయోమీ ప్యాడ్ 6 ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు సంస్థ ధ్రువీకరించింది. ఈ షాయోమీ ప్యాడ్ కి వన్ ప్లస్ ప్యాడ్ గట్టి పోటినిస్తోంది. ప్రస్తుతం ఈ రెండింట్లో ఏది కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.. Xiaomi ప్యాడ్ 6, వన్‌ప్లస్ ప్యాడ్‌లు మెటల్ బాడీ, టాప్ బెజెల్‌లో సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. ఈ రెండూ స్టైలస్ పెన్, కీబోర్డ్‌ను కలిగి ఉన్నాయి. Xiaomi ప్యాడ్ 6 11.0-అంగుళాల 2.8K (1800x2880 పిక్సెల్‌లు) 10-బిట్ LCD స్క్రీన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్, 309ppi పిక్సెల్ డెన్సిటీ, 550-నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.
షాయోమీ ప్యాడ్ 6 బెటర్ ఆప్షన్!
OnePlus ప్యాడ్ 2000x2800 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 296ppi పిక్సెల్ డెన్సిటీ, 500-నిట్స్ గరిష్ట ప్రకాశంతో 11.61-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇందులో 67W ఫాస్ట్ ఛార్జింగ్, (9,510mAh v/s 8,840mAh) బ్యాటరీ సపోర్టు ఉంది. Xiaomi ప్యాడ్ 6 ధరపై జూన్ 13న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్యాడ్ 5 6GB/128GB ధర రూ. 26,999, OnePlus ప్యాడ్ 8GB/128GB మోడల్ రూ. 37,999 ఉండనుంది. ICICI బ్యాంక్ ను ఉపయోగించి లావాదేవీలపై 2వేల వరకు డిస్కౌంట్ ఫొందే అవకాశం ఉంది. ఫీచర్ల పరంగా చూస్తే వన్‌ప్లస్ ప్యాడ్ కంటే షియోమి ప్యాడ్ 6 బెటర్ ఎంపిక అని చెప్పొచ్చు.