LOADING...
Android-iPhone: ఆండ్రాయిడ్-ఐఫోన్‌ మధ్య ఇక AirDrop స్టైల్‌లో ఫైల్‌ షేరింగ్
ఆండ్రాయిడ్-ఐఫోన్‌ మధ్య ఇక AirDrop స్టైల్‌లో ఫైల్‌ షేరింగ్

Android-iPhone: ఆండ్రాయిడ్-ఐఫోన్‌ మధ్య ఇక AirDrop స్టైల్‌లో ఫైల్‌ షేరింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్‌ మరో కీలక అడుగు వేసింది. ఇప్పుడు ఆండ్రాయిడ్‌-ఐఫోన్‌ మధ్య కూడా AirDrop లా ఫైళ్లను పంపుకోవచ్చు. ఇప్పటికే ఉన్న Quick Share ఫీచర్‌ను ఆపిల్‌ AirDrop‌తో కంపాటిబుల్‌గా మార్చుతూ గూగుల్‌ ఈ అప్‌డేట్‌ ప్రకటించింది. దీంతో ఆండ్రాయిడ్‌ నుంచి ఐఫోన్‌కి, ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌కి ఫోటోలు, వీడియోలు, ఫైళ్లు ఈజీగా షేర్‌ చేసుకోవచ్చు. అయితే చిన్న సెట్టింగ్‌ మార్చడం మాత్రం అవసరం. ఈ ఫీచర్‌ మొదటగా పిక్సెల్‌ 10 సిరీస్‌లో రోలౌట్‌ అవుతోంది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మాక్‌ఓఎస్‌ డివైసులు కూడా దీనికి సపోర్ట్‌ చేస్తాయి.

భవిష్యత్ విస్తరణ 

క్విక్ షేర్ అనుకూలతను విస్తరించడానికి ప్రణాళికలు 

గూగుల్‌ చెప్పిన వివరాల ప్రకారం త్వరలోనే ఈ Quick Share సపోర్ట్‌ను మరిన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లకు విస్తరించనుంది. ఇకపై మరో ఫోన్‌ ఏ కంపెనీదైనా కావొచ్చు.. ఫోటో గానీ, ఫైల్‌ గానీ పంపడానికి ఇబ్బంది ఉండదు. ఐఫోన్‌ యూజర్లు ఈ ఫీచర్‌ ఉపయోగించాలంటే AirDrop లోని "Everyone for 10 minutes" ఆప్షన్‌ను ఆన్‌ చేయాలి.

పరస్పర చర్య 

క్రాస్-ప్లాట్‌ఫామ్ షేరింగ్‌కు గూగుల్ విధానం 

క్రాస్‌-ప్లాట్‌ఫార్మ్‌ షేరింగ్‌ వైపు ఇది మొదటి దశ మాత్రమే అని గూగుల్‌ చెబుతోంది. భవిష్యత్తులో 'Contacts Only' మోడ్‌ను కూడా సపోర్ట్‌ అయ్యేలా యాపిల్‌తో కలిసి పని చేయాలన్న ఉద్దేశ్యం ఉందని వెల్లడించింది. ఇరువైపులా ఫైల్‌ పంపుకోవచ్చు, అంటే ఐఫోన్‌ నుంచి పిక్సెల్‌కి కూడా ఫైల్‌ షేర్‌ చేయొచ్చు. అయితే రెండు డివైసులు కూడా "discoverable" గా ఉండాలి.

భద్రతా చర్యలు 

క్విక్ షేర్-ఎయిర్‌డ్రాప్ ఇంటర్‌ఆపరేబిలిటీ: సురక్షితమైన కనెక్షన్ 

భద్రత విషయానికి వస్తే, Quick Share-AirDrop ఇంటరాపరాబిలిటీకి గూగుల్‌ మల్టీ-లేయర్డ్‌ సెక్యూరిటీ అమలు చేసింది. ఎలాంటి వర్క్‌అరౌండ్‌ కాకుండా, డైరెక్ట్‌ పీర్-టు-పీర్‌ కనెక్షన్‌తో ఫైల్‌ పంపబడుతుంది. అంటే డేటా సర్వర్‌ మీదుగా వెళ్లదు, షేర్‌ చేసిన కంటెంట్‌ ఎక్కడా లాగ్‌ చేయబడదు.

యూజర్ కంట్రోల్ 

భద్రత, గోప్యతకు గూగుల్ నిబద్ధత 

అదే సమయంలో యూజర్ల నియంత్రణను గూగుల్‌ మళ్లీ హైలైట్‌ చేసింది. మీరు అప్రూవ్‌ చేసిన ఫైళ్లు మాత్రమే మీ ఫోన్‌లోకి చేరతాయి. సెక్యూరిటీ కోసం NetSPI అనే ప్రముఖ థర్డ్-పార్టీ టీంతో కలిసి పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలిపింది.