YouTube: యూట్యూబ్‌లో షార్ట్స్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త AI ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అయిన యూట్యూబ్ తన తాజా 'మేడ్ ఆన్ యూట్యూబ్' ఈవెంట్‌లో పలు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను ప్రకటించింది. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని షార్ట్స్, పాడ్‌కాస్ట్, లైవ్‌స్ట్రీమింగ్ కార్యక్రమాల్లో ఉపయోగించుకునే కొత్త AI టూల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టూల్స్‌ను యూట్యూబ్ ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా వీడియో బ్యాక్‌గ్రౌండ్లు, సౌండ్‌తో కూడిన క్లిప్‌లు సులభంగా సృష్టించుకోవచ్చు.
వివరాలు
గూగుల్ వియో3.. వీడియో జనరేట్ చేసే AI మోడల్
వియో3 అనే AI మోడల్‌ను ఉపయోగించి 480p క్వాలిటీ వీడియోలను జాప్యం లేకుండా ఉచితంగా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా,బ్రిటన్,కెనడా,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంది. త్వరలో ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యూట్యూబ్ సిద్ధంగా ఉంది. క్రియేటర్లు తమ యూట్యూబ్ యాప్‌లోని 'క్రియేట్' ఆప్షన్ ద్వారా, టాప్‌లో కుడివైపు ఉన్న'sparkle icon' క్లిక్ చేసి ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఈ టూల్ ద్వారా స్టిల్ ఫొటోలతో వీడియోలు రూపొందించడం, వీడియోలకు 'పాప్ ఆర్ట్' లేదా 'ఒరిగామి' లుక్ ఇవ్వడం, ప్రాంప్ట్ ద్వారా క్యారెక్టర్, ప్రాప్, ఎఫెక్ట్‌లను చేర్చడం వంటి అనేక విషయాలు చేయవచ్చు. ఇంకా కొన్ని నెలల్లో మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
పాడ్‌కాస్ట్ ఫీచర్ ఇంటిగ్రేషన్
యూట్యూబ్ ఇప్పుడు పాడ్‌కాస్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా వియో3 AI మోడల్‌ను ఇంటిగ్రేట్ చేస్తోంది. దీని ద్వారా పాడ్‌కాస్టర్‌లు తమ పూర్తి ఎపిసోడ్‌ల నుంచి వీడియో క్లిప్‌లు, షార్ట్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే, వీడియో రికార్డింగ్ లేకపోయినా, కేవలం ఆడియో ఫైల్ ఆధారంగా కస్టమైజ్ చేయదగిన వీడియోలు సృష్టించుకోవచ్చు. ఇది పాడ్‌కాస్టర్‌లకు కొత్త అవకాశాలను తెస్తోంది.
వివరాలు
లైవ్‌స్ట్రీమింగ్‌లో కొత్త ఫీచర్లు
లైవ్‌స్ట్రీమింగ్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ మరిన్ని AI ఆధారిత ఫీచర్లను ప్రకటించింది. ఇప్పటివరకు యూజర్లకే అందుబాటులో ఉన్న ప్లేయబుల్స్‌ను (Playables) ఇప్పుడు క్రియేటర్లు కూడా ప్రత్యక్షంగా లైవ్‌లో ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా, లైవ్‌స్ట్రీమ్ చేస్తూనే గేమ్‌లు ఆడడం, మానిటైజ్ చేయడం, ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ కావడం సులభమవుతోంది. ఇక నుంచి క్రియేటర్లు వర్టికల్ లైవ్‌స్ట్రీమ్ కూడా నిర్వహించవచ్చు. అదనంగా, లైవ్ స్ట్రీమింగ్ నుంచి హైలైట్స్, షార్ట్స్‌ను సృష్టించుకునే ప్రత్యేక AI టూల్‌ను కూడా యూట్యూబ్ అందిస్తోంది.