Youtube: టీనేజర్లకు షాక్ ఇచ్చిన యూట్యూబ్.. రెంటల్ కంట్రోల్స్,షార్ట్స్ స్క్రోలింగ్‌కు టైమ్ లిమిట్
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్ ఇప్పటికే పిల్లల డివైసులపై తల్లిదండ్రులు నియంత్రణలు పెట్టడానికి వివిధ టూల్స్ అందిస్తోంది. తాజాగా, టీనేజర్ల వీక్షణ అలవాట్లపై మరింత నియంత్రణ ఇవ్వడానికి కొత్త ఫీచర్లను యూట్యూబ్ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా, టీనేజర్లు యూట్యూబ్ షార్ట్స్‌ను ఎంతసేపు స్క్రోల్ చేయగలరో పరిమితం చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదనంగా, వయసుకు సరిపడే కంటెంట్‌ను ప్రోత్సహించే కొత్త మార్గదర్శకాలు, క్రియేటర్ గైడ్‌ను కూడా విడుదల చేసింది. అలాగే, పిల్లల కోసం కొత్త అకౌంట్లను సులభంగా సృష్టించడానికి అప్‌డేటెడ్ సైన్-అప్ అనుభవాన్ని యూట్యూబ్ అందించనుంది.
వివరాలు
షార్ట్స్ ఫీడ్‌ను పూర్తిగా 'జీరో'కి కూడా సెట్ చేయవచ్చు
యూట్యూబ్ ఇటీవల ప్రచురించిన బ్లాగ్ పోస్టులో ఈ కొత్త అప్‌డేట్స్ వివరాలు వెల్లడించింది. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లలు షార్ట్స్‌ను ఎంతసేపు వీక్షించగలరో స్పష్టంగా లిమిట్ పెట్టవచ్చు. భవిష్యత్తులో, షార్ట్స్ ఫీడ్‌ను పూర్తిగా 'జీరో'కి కూడా సెట్ చేయవచ్చని యూట్యూబ్ తెలిపింది. అవసరాన్ని బట్టి ఒక రోజు మొత్తం షార్ట్స్‌ను ఆపేయడం లేదా గరిష్టంగా 60 నిమిషాల వరకు వీక్షణకు అనుమతించవచ్చు. 15, 30, 45 నిమిషాలు, 1 లేదా 2 గంటల వేరియేషన్లలో షార్ట్స్ టైమ్ సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు, సూపర్వైజ్డ్ యూట్యూబ్ అకౌంట్లలో బెడ్‌టైమ్ మరియు 'టేక్ ఎ బ్రేక్' రిమైండర్లను కూడా కస్టమైజ్ చేయవచ్చు.
వివరాలు
టీనేజర్లకు ఉపయోగకరమైన కంటెంట్ అందించడమే లక్ష్యంగా క్రియేటర్ గైడ్
అంతేకాక, టీనేజర్లకు ఉపయోగకరమైన కంటెంట్ అందించడమే లక్ష్యంగా యూట్యూబ్ కొత్త క్రియేటర్ గైడ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఖాన్ అకాడమీ, క్రాష్‌కోర్స్, టెడ్-ఎడ్ వంటి విద్యాపరమైన వీడియోలను టీనేజర్లకు ఎక్కువగా సూచిస్తుంది. ఈ మార్గదర్శకాలను యూత్ అడ్వైజరీ కమిటీ, యూసీఎల్‌ఏ సెంటర్ ఫర్ స్కాలర్స్ అండ్ స్టోరీటెల్లర్స్‌తో కలిసి రూపొందించామని యూట్యూబ్ వెల్లడించింది. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్, బోస్టన్ చిల్డ్రెన్స్ హాస్పిటల్ డిజిటల్ వెల్‌నెస్ ల్యాబ్ వంటి పలు అంతర్జాతీయ నిపుణులు దీనికి మద్దతు ఇచ్చారు.
వివరాలు
అప్‌డేటెడ్ సైన్-అప్ విధానం
రాబోయే వారాల్లో , అప్‌డేటెడ్ సైన్-అప్ విధానం ద్వారా, టీనేజర్లు ఆటోమేటిక్‌గా 18 కంటే తక్కువ వయసులో ఉన్న ప్రొటెక్టెడ్ అకౌంట్లలో చేరేలా యూట్యూబ్ ఏర్పాట్లు చేస్తుంది. తల్లిదండ్రులు కూడా యాప్‌లోనే సులభంగా అకౌంట్ల మధ్య మార్పులు చేసుకునేలా ఇది సౌకర్యాన్ని కలిగిస్తుంది.