YouTube: క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త టూల్.. జెమిని AI తో గేమ్ డెవలప్‌మెంట్
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్ క్రియేటర్ల కోసం మరో కొత్త అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇకపై Gemini AI సహాయంతో గేమ్స్ తయారు చేసుకునే అవకాశం యూట్యూబ్ కల్పిస్తోంది. ఈ క్రమంలో YouTube Gaming తాజాగా Playables Builder పేరుతో ఓపెన్ బీటా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ టూల్ ద్వారా ఎలాంటి కోడింగ్ పరిజ్ఞానం లేకపోయినా, ఎంపికైన యూట్యూబ్ క్రియేటర్లు చిన్న స్థాయి గేమ్స్‌ను సులభంగా రూపొందించుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌కి గూగుల్ రూపొందించిన Gemini 3 AI టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ప్రోటోటైప్ వెబ్ యాప్ శక్తినిస్తుంది. ఇప్పటికే 2023లో డెస్క్‌టాప్, మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లలో మినీ గేమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన యూట్యూబ్, ఇప్పుడు ఆ ప్రయత్నాలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.
వివరాలు
ప్లేయబుల్స్‌కు మల్టీప్లేయర్ సపోర్ట్
Playables Builder యూట్యూబ్ గేమింగ్ ఎకోసిస్టమ్‌ను మరింత విస్తరించే ప్రయత్నంగా కనిపిస్తోంది. గతేడాది ప్లేయబుల్స్‌కు మల్టీప్లేయర్ సపోర్ట్‌ను కూడా యూట్యూబ్ అందించింది. దాంతో యూజర్ల మధ్య ఇంటరాక్షన్ మరింత పెరిగింది. ఇప్పుడు ఈ AI ఆధారిత టూల్ రావడంతో, క్రియేటర్లు తమ క్రియేటివిటీని ఉపయోగించి ప్రేక్షకులకు కొత్త తరహా గేమింగ్ అనుభవాలను అందించే అవకాశం ఏర్పడింది.
వివరాలు
ప్లేబుల్స్ బిల్డర్‌లో AI లేయర్
Playables Builderలో ఉన్న AI లేయర్, గూగుల్‌లోని Disco, GenTabs వంటి ప్రాజెక్ట్‌ల తరహాలోనే పనిచేస్తుంది. సాధారణ భాషలో మనం ఇచ్చే ఆదేశాల ఆధారంగా, కావాల్సిన విధంగా పనిచేసే ఇంటరాక్టివ్ విడ్జెట్‌ను ఇది రూపొందిస్తుంది. అయితే, గేమ్ డెవలప్‌మెంట్ విషయంలో ఈ విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న దానిపై కొంతమంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ నాలెడ్జ్ లేకుండానే గేమ్స్ తయారీలో AI సహకరిస్తుందనేది నిజమేనని, కానీ ఆటగాళ్లకు నిజంగా ఆసక్తికరంగా అనిపించే గేమింగ్ అనుభవాన్ని ఇవ్వగలుగుతుందా అనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.