Page Loader
YouTube: కంటెంట్‌ క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ సరికొత్త ఫీచర్‌.. ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగపడనుందంటే..?
కంటెంట్‌ క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ సరికొత్త ఫీచర్‌.. ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగపడనుందంటే..?

YouTube: కంటెంట్‌ క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ సరికొత్త ఫీచర్‌.. ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగపడనుందంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్తగా ఏఐ ఆధారిత ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ అంశాన్ని యూట్యూబ్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.ఈ ఫీచర్ సహాయంతో కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలను ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావచ్చు. కొత్త ఆటో డబ్బింగ్ ఫీచర్ వీడియోల వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వివిధ భాషల్లోకి అనువదించి వినిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భాషాపరమైన అడ్డంకులు లేకుండా వీడియోలను ఇతర భాషల్లో పోస్ట్ చేసేందుకు ఇది సహాయపడుతుంది. ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ వంటి భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేయగలదు.

వివరాలు 

యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్‌లో ఈ డబ్‌డ్ వీడియోలు

అంతేకాక, వీడియోలోని వాయిస్ ఏ భాషలో ఉన్నా,అవసరమైతే, దాన్ని ఆటోమేటిక్‌గా ఇంగ్లిష్‌లోకి మార్చే సౌకర్యాన్ని కూడా ఈ ఫీచర్ అందిస్తుంది. యూట్యూబ్ డబ్ చేసిన ఆడియోలపై"ఆటో డబ్‌డ్‌" అనే లేబుల్ యూజర్లకు కనిపిస్తుంది. డబ్బింగ్ వాయిస్‌ను వినాలనిపించకపోతే,ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ద్వారా ఒరిజినల్ వాయిస్‌ను ఎంచుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్లు వీడియోను అప్‌లోడ్ చేసిన వెంటనే,యూట్యూబ్ ఆడియోను గుర్తించి సపోర్ట్ చేసే భాషల్లోకి ఆటోమేటిక్‌గా మార్చుతుంది. యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్‌లో ఈ డబ్‌డ్ వీడియోలు కనిపిస్తాయి,వాటిని నియంత్రించేందుకు పూర్తి అధికారం కంటెంట్ క్రియేటర్లకు ఉంటుంది. అయితే,వాయిస్‌ను గుర్తించలేని పరిస్థితుల్లో డబ్బింగ్ ఆప్షన్ పని చేయదని యూట్యూబ్ పేర్కొంది. కంటెంట్ క్రియేటర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ ఫీచర్‌లో మరిన్ని మెరుగుదలలు చేయనున్నట్లు యూట్యూబ్ తెలిపింది.