
YouTube: కంటెంట్ క్రియేటర్ల కోసం మరింత విస్తరించనున్న యూట్యూబ్ మల్టీ లాంగ్వేజ్ ఆడియో ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ తాజాగా మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ఫీచర్ ను మరింత విస్తరించినట్లు ప్రకటించింది. దీని ద్వారా ఇప్పుడు కోట్ల సంఖ్యలో కంటెంట్ క్రియేటర్ల కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో క్రియేటర్లు తమ వీడియోలను స్థానిక భాషల్లో అందించటం సులభమవుతుంది. ఫలితంగా, వీరి కంటెంట్ మరింత ఎక్కువ మంది వ్యూయర్స్‌కు చేరుతుంది. ఈ ఫీచర్ తో.. ఒక క్రియేటర్ వారి భాషలో వీడియోను అప్లోడ్ చేస్తే.. మిగితా దేశాలలో వీక్షకులు తమ సొంత భాషలో వీడియోను వీక్షించొచ్చు మల్టీ-లాంగ్వేజ్ ఆడియో ట్రాక్స్ జతచేసిన క్రియేటర్లు సాధారణంగా వీడియో వీక్షణలో 25% వరకు అదనపు వ్యూస్ పొందుతారు.
వివరాలు
మల్టీ-లాంగ్వేజ్ ఆడియో వాడడం వలన మూడు రెట్ల వ్యూస్
ఈ ఫీచర్ రెండు సంవత్సరాల క్రితం చిన్న స్థాయిలో పైలట్ ప్రోగ్రాంగా ప్రారంభించబడింది. ఆ సమయంలో, వివిధ భాషల్లో డబ్బింగ్ చేసేందుకు కొద్దీ మంది క్రియేటర్లకు మాత్రమే అనుమతించారు. ఓ ఛానల్‌లో మల్టీ-లాంగ్వేజ్ ఆడియో వాడడం వలన వ్యూస్ మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచంలోని ప్రముఖ క్రియేటర్లు ఈ ఫీచర్‌ను వినియోగిస్తూ, తమ కంటెంట్‌ను అంతర్జాతీయంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరవేస్తున్నారు. కొంతమంది క్రియేటర్లు తమ వీడియోలను 30కూ పైగా భాషల్లో డబ్బింగ్ చేసి వారి వీడియోలు అందజేస్తున్నారు.
వివరాలు
మల్టీ-లాంగ్వేజ్ థంబ్ నెయిల్స్
యూట్యూబ్ త్వరలో మరిన్ని క్రియేటర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా, యూట్యూబ్ మల్టీ-లాంగ్వేజ్ థంబ్ నెయిల్స్ (Localized Thumbnails) పై కూడా ప్రయోగాలు చేస్తోంది. దీని ద్వారా, వీడియోను వీక్షించే వ్యక్తి ఎంచుకున్న భాష ఆధారంగా, థంబ్ నెయిల్‌లు స్థానికీకరించి చూపించబడతాయి. సారాంశంగా, ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లకు తమ కంటెంట్‌ను ఎక్కువగా షేర్ చేయడానికి, భిన్న భాషల ప్రేక్షకులతో బలమైన సంబంధం ఏర్పరచడానికి, కంటెంట్ రీచ్ పెంచడానికి,అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.