Page Loader
Youtube Shorts: యూట్యూబ్ షార్ట్స్ ఇక మూడు నిమిషాలు.. ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి..
యూట్యూబ్ షార్ట్స్ ఇక మూడు నిమిషాలు

Youtube Shorts: యూట్యూబ్ షార్ట్స్ ఇక మూడు నిమిషాలు.. ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ గురువారం ఒక శుభవార్త ప్రకటించింది. అక్టోబర్‌ 15 నుండి, వీడియో క్రియేటర్స్ తమ షార్ట్ వీడియోల నిడివిని మూడు నిమిషాల వరకు పెంచుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం యూట్యూబ్ 60 సెకన్లలోపు మాత్రమే షార్ట్స్‌ను అనుమతిస్తుంది, అందువల్ల కొన్ని అంశాలను చాలా కుదించి చూపించాల్సి వస్తోంది, దీని వల్ల పూర్తి సమాచారం అందించడం కష్టమవుతోంది. ఇప్పుడు, ఈ కొత్త అప్‌డేట్‌తో, క్రియేటర్స్ తమ వీడియోలను మరింత క్రియేటివ్‌గా తయారుచేసుకోవచ్చు. అయితే ఈ మార్పు చతురస్రం లేదా పొడవుగా ఉండే వీడియోలకే వర్తిస్తుంది. అక్టోబర్‌ 15 నాటికి అప్‌లోడ్‌ చేసిన వీడియోలు ఏవీ ఈ మార్పుతో ప్రభావితం కావు.

వివరాలు 

షార్ట్ వీడియోలను టెంప్లేట్‌గా ఉపయోగించి తమ సొంత వీడియోలను సృష్టించవచ్చు

రాబోయే నెలల్లో పొడవైన షార్ట్స్‌కు సంబంధించి మరిన్ని మార్పులను చేయడానికి యూట్యూబ్‌ కృషి చేస్తుందని తెలిపింది. అలాగే, దీర్ఘకాలిక వీడియోలను సృష్టించాలనుకుంటే, 16:9 నిష్పత్తిలో అప్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నది. యూట్యూబ్‌ క్రియేటర్ల కోసం కొత్త ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. అందులో మొదటిది రీమిక్స్. దీని ద్వారా వినియోగదారులు పాపులర్‌ అయిన షార్ట్ వీడియోలను టెంప్లేట్‌గా ఉపయోగించి తమ సొంత వీడియోలను సృష్టించవచ్చు. రాబోయే రోజుల్లో, షార్ట్‌లను ఇతర వీడియోల నుంచి క్లిప్‌లు తీసుకుని రీమిక్స్ చేయడాన్ని సులభతరం చేసే అప్‌డేట్‌ను యూట్యూబ్‌ అందించనుంది. అక్టోబర్‌ 15కు ముందు అప్‌లోడ్‌ చేసిన మూడు నిమిషాల నిడివి కలిగిన వీడియోలు సాదారణ దీర్ఘ కంటెంట్‌గా వర్గీకరించబడతాయని వెల్లడించింది.

వివరాలు 

60 సెకన్లకు మించిన మెటీరియల్‌ ఉపయోగిస్తే..

పొడవైన షార్ట్స్‌ కోసం కాపీరైట్ విధానాలు కూడా వివరించాయి. కాపీరైట్ చేయబడి 60 సెకన్లకు మించిన మెటీరియల్‌ను యూట్యూబ్‌ కంటెంట్‌లో ఉపయోగిస్తే, అది బ్లాక్ చేయబడుతుంది, తద్వారా క్రియేటర్‌ ఛానెల్‌ మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.