Page Loader
యూట్యూబ్‌ టీవీలో కొత్త ఫీచర్.. అన్నీ ప్రసారాలు ఒకేసారి! 
యూట్యూబ్‌ టీవీలో కొత్త ఫీచర్.. అన్నీ ప్రసారాలు ఒకేసారి!

యూట్యూబ్‌ టీవీలో కొత్త ఫీచర్.. అన్నీ ప్రసారాలు ఒకేసారి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2023
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీవీల్లో యూట్యూబ్ చూసేవారికి గుడ్ న్యూస్ అందింది. యూట్యూబ్ అధికారికంగా ఓ కొత్త ఫీచర్‌తో యూట్యూబ్ టీవీ కోసం తీసుకొచ్చింది. ఒకే స్క్రీన్‌లో గరిష్టంగా నాలుగు ప్రసారాలను చూసే అవకాశాన్ని కల్పించనుంది. ఛానెల్ మారకుండానే మనకు ఇష్టమైన క్రీడలు, ప్రత్యక్ష ప్రసారాలను ఒకేసారి చూడొచ్చు. మల్టీవ్యూ ఫీచర్ తో ఈ సదుపాయం కలగనుంది. ఈ ఫీచర్ ఎంచుకున్న తర్వాత వీక్షకులు స్ట్రీమ్‌ల మధ్య క్యాప్షన్‌లు లేదా ఆడియోను కూడా మార్చడానికి ఆస్కారం లభించనుంది. మల్టీవ్యూ ప్రధానంగా క్రీడా అభిమానుల కోసం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. క్రీడలు, వ్యాపారం, వాతావరణం, మరెన్నో 24/7 చూడటానికి ఈ కొత్త మల్టీవ్యూ స్ట్రీమ్‌ ఉపయోగపడనుంది.

Details

మొబైల్ యాప్ లో ఈ ఫీచర్ వర్తించదు 

మల్టీవ్యూని ప్రారంభించడానికి ముందుగా YouTube TV సబ్‌స్క్రైబర్‌లు హోమ్ ట్యాబ్‌లో మల్టీవ్యూ స్ట్రీమ్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మల్టీవ్యూలో నిర్దిష్ట ఆడియో సోర్స్, క్యాప్షన్‌లను ఎంచుకోవడానికి యూట్యూబ్ టీవీ వినియోగదారులను అనుమతిని ఇచ్చింది. YouTube TV తన మల్టీవ్యూ ఫీచర్‌ని నెమ్మదిగా మెరుగుపరుస్తోంది. త్వరలో స్ట్రీమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతానికి సబ్‌స్క్రైబర్‌లు ముందుగా ఎంచుకున్న మల్టీవ్యూ స్క్రీన్‌లను అంగీకరించాలి. వెబ్ వెర్షన్ లేదా మొబైల్ యాప్‌లలోని వ్యక్తులకు ఈ ఫీచర్ యాక్సెస్ ను ఇవ్వకపోవడం గమానర్హం.