Page Loader
YouTuber Ankush Bahuguna:సైబర్ అరెస్ట్ స్కామ్‌లో 40 గంటలపాటు చిక్కుకున్న యూట్యూబర్ అంకుశ్ బహుగుణా.. సెల్ఫ్‌ వీడియో విడుదల చేసిన బాధితుడు.. 
సైబర్ అరెస్ట్ స్కామ్‌లో 40 గంటలపాటు చిక్కుకున్న యూట్యూబర్ అంకుశ్ బహుగుణా

YouTuber Ankush Bahuguna:సైబర్ అరెస్ట్ స్కామ్‌లో 40 గంటలపాటు చిక్కుకున్న యూట్యూబర్ అంకుశ్ బహుగుణా.. సెల్ఫ్‌ వీడియో విడుదల చేసిన బాధితుడు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూట్యూబర్ అంకుశ్ బహుగుణా సైబర్ అరెస్ట్ స్కామ్‌లో 40 గంటలపాటు చిక్కుకుని ఎదురైన చేదు అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, ఈ స్కామ్‌లో తాను ఎలా చిక్కుకున్నాడో వివరంగా చెప్పాడు. ఇటువంటి మోసాల గురించి అవగాహన కల్పించడం కోసం తన అనుభవాన్ని పంచుకున్నట్లు ఆయన తెలిపారు.

వివరాలు 

ఈ స్కామర్లు పరిశోధన చేస్తారు

నా అనుభవాన్ని మీతో పంచుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను,ఎందుకంటే నా వంటి అనుభవం ఎవరికీ రావద్దని ఆశిస్తున్నాను. నా ప్రవర్తనలో జరిగిన మార్పులను గమనించగలిగిన మంచి స్నేహితులు ఉండటం నా అదృష్టం. "నేను బాగున్నాను" అని నేను చెప్పినా, వారు నాలోని మార్పులను గుర్తించి నన్ను ఆడగించారు. సైబర్ స్కామ్‌లు గురించి చాలా మందికి అవగాహన ఉండొచ్చు, కానీ వీటికి శిక్షణ పొందిన స్కామర్లు ఎంత ప్రమాదకరంగా వ్యవహరిస్తారో నా అనుభవం ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. వారు వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఉపయోగించి నన్ను భయపెట్టారో వివరంగా తెలియజేస్తున్నాను. "ఈ స్కామర్లు పరిశోధన చేస్తారు, మీపై ప్రభావం చూపే అంశాలను తెలుసుకుంటారు. ఎవరికీ ఇలాంటి అనుభవం రాకూడదని కోరుకుంటున్నాను," అని అంకుశ్ అన్నారు.

వివరాలు 

40 గంటలపాటు నేను 'డిజిటల్ అరెస్ట్'లో ఉన్నాను

"నేను ఇప్పటికీ కొంతమేరకు షాక్‌లోనే ఉన్నాను. నా డబ్బు కోల్పోయాను. నా మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇది నా జీవితంలో జరిగిందని నమ్మలేకపోతున్నాను. దాదాపు 40 గంటలపాటు నేను 'డిజిటల్ అరెస్ట్'లో ఉన్నాను. ఈ స్కామ్‌లు ఎంత త్వరగా జరుగుతాయో నాకు ఇప్పుడే అర్థమైంది. కానీ, నా వంటి వారు దీనిని అర్థం చేసుకోలేకపోతే, అది ఎంత క్లిష్టంగా ఉంటుందో చెప్పడం కష్టం," అని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

నన్ను ఎలా మోసం చేసారంటే..

"జిమ్‌ నుండి తిరిగొచ్చినప్పుడు ఒక అంతర్జాతీయ నంబర్ నుండి కాల్ వచ్చింది.పెద్దగా ఆలోచించకుండా కాల్‌ తీసుకున్నాను.ఆ కాల్‌లో ఆటోమేటెడ్ సందేశం వినిపించింది,'మీ కొరియర్ డెలివరీ క్యాన్సిల్‌ అయ్యింది.సహాయానికి జీరో నొక్కండి.' అని. నేను జీరో నొక్కాను, ఇది నా జీవితంలోనే చేసిన అతిపెద్ద తప్పు.ఆ తర్వాత కస్టమర్‌ సపోర్ట్ ప్రతినిధి కాల్ తీసుకుని,'మీ ప్యాకేజీలో అక్రమ వస్తువులు పట్టుబడ్డాయి' అని చెప్పాడు,"అని అంకుశ్ చెప్పారు. "ఆ ప్రతినిధి,మీరు చైనాకు ప్యాకేజీ పంపించారు,అది ఇప్పుడు కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నాయి అని అన్నారు.నేను ప్యాకేజీ పంపలేదని చెప్పినప్పటికీ,ఆయన నా పేరు, ఆధార్‌ నంబర్‌,అన్నీ ప్యాకేజీలో ఉన్నాయన్నట్లు చెప్పారు.ఇది తీవ్రమైన నేరం,మీపై అరెస్ట్‌ వారెంట్‌ ఉంది, ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారని చెప్పాడు,"అని అంకుశ్ వివరించారు.

వివరాలు 

మూర్ఖత్వంగా భావించకండి

"అందరూ భయానికి ఒకే విధంగా స్పందించరు. దీనిని మూర్ఖత్వంగా భావించకండి. మీ చుట్టూ ఉన్నవారికి అవగాహన కల్పించండి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు అప్రమత్తంగా ఉండడం ఎంత ముఖ్యమో చెప్పాలని నా ఉద్దేశ్యం," అని అంకుశ్ తన మాటలను ముగించారు.