
Andhra Pradesh Zero Shadow Today: ఏపీలో అద్భుతం.. ఇవాళ్టి నుంచి జీరో షాడో డే.. మిట్ట మధ్యాహ్నం నీడ మాయం
ఈ వార్తాకథనం ఏంటి
నేటి (సోమవారం)నుంచి ఈ నెల 14వతేదీ వరకు మధ్యాహ్న సమయాలలో మనిషి నీడ రెండు నిమిషాలపాటు పూర్తిగా కనబడదు.
ఈ ఫినామెనన్‌ని "జీరో షాడో" అని పిలుస్తారని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ (ఐఏఎస్‌సీ)జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ ఆదివారం ప్రకటించారు.
ఈ ప్రక్రియలో, కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి భూమిపై లంబంగా పడుతుంది,అందువల్ల నీడ కనిపించదు.
"భూమి అక్షం 23.5డిగ్రీల వంపు కారణంగా,భూమి సూర్యుడి చుట్టూ చలిస్తుంటే,సూర్యుడు ఉత్తర-దక్షిణ దిశలలో మారుతూ ఉంటుంది.
వివరాలు
నిలువు వస్తువుల మీద నీడ రెండు నిమిషాలపాటు కనిపించదు
ఈ మార్పు రెండు ప్రత్యేక సమయాల్లో,ప్రతి సంవత్సరం కర్కాటక,మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు భూమిపై పూర్తిగా లంబంగా పడతాయి.
ఈ దశలో,నిలువు వస్తువుల మీద నీడ రెండు నిమిషాలపాటు కనిపించదు"అని సుసత్యరేఖ వివరించారు.
ఖగోళ శాస్త్రవేత్తలు, సూర్యుని కదలికలను, స్థానాన్ని అధ్యయనం చేసేందుకు ఈ "జీరో షాడో" ప్రయోగం ఉపకరిస్తుందని సుసత్యరేఖ పేర్కొన్నారు.