Loading...
Rohit Sharma: కివీస్‌పై 1,134 పరుగులు.. అయినా న్యూజిలాండ్ గడ్డపై రోహిత్‌కు ఆ రికార్డు కరువే!
కివీస్‌పై 1,134 పరుగులు.. అయినా న్యూజిలాండ్ గడ్డపై రోహిత్‌కు ఆ రికార్డు కరువే!

Rohit Sharma: కివీస్‌పై 1,134 పరుగులు.. అయినా న్యూజిలాండ్ గడ్డపై రోహిత్‌కు ఆ రికార్డు కరువే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 4, 2026న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో ప్రారంభం కానుంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో రాణించాలని చూస్తున్నాడు. న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు 34 వన్డేలు ఆడిన రోహిత్ 36.58 సగటుతో 1,134 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలున్నాయి. కివీస్‌పై 49 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. మరో సిక్సర్ కొడితే 50 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై 681 పరుగులు సాధించాడు.

వివరాలు

ఇప్పటివరకూ ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు

ఇక న్యూజిలాండ్ గడ్డపై 14 వన్డేలు ఆడిన రోహిత్ 437 పరుగులు చేశాడు.

36.42 సగటుతో పాటు నాలుగు అర్ధ సెంచరీలు సాధించినప్పటికీ.. ఇప్పటివరకు అక్కడ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు.

కివీస్‌పై రోహిత్ సాధించిన రెండు వన్డే శతకాలూ భారత గడ్డపైనే వచ్చాయి. 2017లో కాన్పూర్‌లో 147 పరుగులు, 2023లో ఇండోర్‌లో 101 పరుగులు చేశాడు.

ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ గడ్డపై తన తొలి వన్డే సెంచరీ సాధిస్తాడేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT