LOADING...
Rohit Sharma 15 Years: ముంబైతో 15 ఏళ్లు.. రోహిత్ శర్మ అద్భుత ప్రయాణం.. రికార్డులివే!
ముంబైతో 15 ఏళ్లు.. రోహిత్ శర్మ అద్భుత ప్రయాణం.. రికార్డులివే!

Rohit Sharma 15 Years: ముంబైతో 15 ఏళ్లు.. రోహిత్ శర్మ అద్భుత ప్రయాణం.. రికార్డులివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోహిత్ శర్మ తన ముంబై జట్టుతో ఉన్న అనుబంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్, 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. 2011 ఏప్రిల్ 10న అప్పటి దిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ముంబై జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ 15 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టులతో ఆయనను అభినందిస్తున్నారు. ఈ కాలంలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు కీలక స్థంభంగా నిలిచాడు. జట్టు విజయాల్లో అతని పాత్ర ఎంతో ముఖ్యమైనది.

వివరాలు

6వేల పరుగుల నమోదు

ముంబై తరఫున 230కి పైగా మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్, దాదాపు 6,000 పరుగులు నమోదు చేసి, జట్టుకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాకుండా, ముంబై తరఫున అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు 15కిపైగా సీజన్లు ఆడిన ఏకైక ఆటగాడిగా మరో ప్రత్యేక ఘనతను అందుకున్నాడు.

వివరాలు

అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ముంబై

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ అద్భుతమైన విజయాలను సాధించాడు. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో 5 టైటిల్స్ గెలుచుకుని అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది. కీలక సమయాల్లో జట్టును విజయతీరాలకు చేర్చడంలో అతని నాయకత్వం ఎంతో ప్రభావవంతంగా నిలిచింది. కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా, తన ప్రశాంత స్వభావం, మ్యాచ్‌పై అద్భుతమైన అవగాహన, యువ ఆటగాళ్లను ప్రోత్సహించే విధానం ద్వారా కూడా రోహిత్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ 15 ఏళ్ల ప్రయాణం అతని కృషి, ప్రతిభ, నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ లెగసీ ఇప్పటికే చిరస్థాయిగా నిలిచిపోయింది.

Advertisement