
Virat Kohli: 17 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. కోహ్లీ సొంతం చేసుకున్న 17 ప్రపంచ రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు 2008 ఆగస్టు 18. ఎందుకంటే, ఆ రోజు ఒక సాధారణ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తన అసాధారణ ప్రతిభతో కొత్త రికార్డుల సృష్టించాడు. అతనే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. ఈ ఆగస్టు 18తో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తన కృషి, ప్రతిభతో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కీర్తి పొందిన కోహ్లీ, లెక్కలేనన్ని రికార్డులను తన పేరుతో లిఖించుకున్నారు. టెస్ట్, టీ20లకు రిటైర్ అయినప్పటికీ, ఆయన సాధించిన అనేక అసాధారణ రికార్డులు ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.
Details
17 ఏళ్ల కోహ్లీ అసాధారణ రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్‌లో గత 17 ఏళ్లలో అత్యధిక పరుగులు (27,599) సాధించిన ఆటగాడు. అత్యధిక హాఫ్ సెంచరీలు (143), అత్యధిక సెంచరీలు (82) సాధించిన బ్యాట్స్‌మన్. ఒకే దేశంపై అత్యధికంగా 7 శతకాలు చేసిన రికార్డు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు (2,721), మొత్తం బౌండరీలు (3,027) సాధించిన ఆటగాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు(69), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు(21) గెలుచుకున్నాడు. ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధిక పరుగులు(3,954), అత్యధిక 50+ స్కోర్లు (39) సాధించిన ఆటగాడు. ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (15), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (3) అవార్డులు గెలిచాడు. ప్రపంచంలో అత్యధిక ఐసీసీ అవార్డులు (10)సాధించిన ఆటగాడు కూడా కోహ్లీయే.
Details
ఐసీసీ ఫైనల్స్ లో అత్యధిక పరుగులు
ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు (1,024), అత్యధిక 50+ స్కోర్లు (10) సాధించారు. ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు (411) సాధించిన ఆటగాడు. కెప్టెన్‌గా గత 17 ఏళ్లలో అత్యధిక పరుగులు (12,883) నమోదు చేశారు. కెప్టెన్‌గా అత్యధిక శతకాలు (41), అత్యధిక డబుల్ సెంచరీలు (7) కొట్టిన రికార్డు. కెప్టెన్‌గా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (27), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (12) గెలిచారు. గెలిచిన మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు (18,098) సాధించిన ఆటగాడు. గెలిచిన మ్యాచ్‌లలో అత్యధిక హాఫ్ సెంచరీలు (88), శతకాలు (58), అలాగే అత్యధిక డబుల్ సెంచరీలు (6) సాధించారు.