
IND vs WI: భారత్ తో మొదటి టెస్ట్ .. వెస్టిండీస్ 162 ఆలౌట్!
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత జట్టు (Team India), వెస్టిండీస్ (West Indies) ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆ జట్టు ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలవలేదు. కేవలం 44 ఓవర్లలోనే కరేబియన్ జట్టు 162 పరుగులకే ఆలౌటైంది. ఆరంభంలోనే వెస్టిండీస్ ఓపెనర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (0) ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యాడు. జాన్ క్యాంప్‌బెల్ (8) కూడా ఎక్కువసేపు నిలువలేక మైదానం వీడాడు. తరువాతి బ్యాటర్లు కూడా వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు ఇన్నింగ్స్ కూలిపోయింది.
వివరాలు
విజృంభించిన మహ్మద్ సిరాజ్
బ్యాటర్లలో కేవలం కొంతమంది మాత్రమే ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులు (48 బంతుల్లో, 4 ఫోర్లు),షై హోప్ 26 పరుగులు (36 బంతుల్లో, 3 ఫోర్లు),రోస్టన్ చేజ్ 24 పరుగులు (43 బంతుల్లో, 4 ఫోర్లు) చేసి జట్టుకు కొంత స్కోరు అందించారు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ధాటిగా ఆడి కరేబియన్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఓపెనర్ చందర్‌పాల్‌ను ఔట్ చేస్తూ భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. మొత్తంగా 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) 3 వికెట్లు సాధించగా, కుల్‌దీప్ యాదవ్ (Kuldeep Yadav) 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.