
రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ హీరో
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా బౌలర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మంట్ ప్రకటించారు. ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ లో జోగిందర్ చివరి ఓవర్ వేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ ఫైనల్ చివరి ఓవర్లో మిస్బాను ఔట్ చేసి అప్పట్లో వార్తల్లోకెక్కాడు.
తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా విషయాన్ని జోగిందర్ వెల్లడించారు. ఇప్పటివరకు టీమిండియా తరుపున నాలుగు టీ20లు, నాలుగు వన్డేలను మాత్రమే ఆడాడు.
చివరి టీ20 2007లో ఆడగా.. దాదాపు 16 ఏళ్లకు తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. తన క్రికెట్ ప్రయాణం తన జీవితంలో ఎంతో అద్భుతమైనదని జోగిందర్ చెప్పుకొచ్చాడు.
జోగిందర్
మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు
2012 నుంచి 2017 వరకూ తన క్రికెట్ ప్రయాణం జీవితంలో మరిచిపోలేదని, ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని జోగిందర్ వెల్లడించారు. తన కెరీర్‌లో తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, చైన్నై సూపర్ కింగ్స్, హర్యానా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.
2007 అక్టోబర్‌లోనే హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన జోగిందర్ శర్మ, 2016-17 సీజన్ వరకూ రంజీ మ్యాచుల్లో ఆడాడు. 2012 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడారు.
ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడి, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మొత్తం 12 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు 2013 వేలంలో అమ్ముడుపోని జోగిందర్ శర్మ, ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడేందుకు ఇంట్రస్ట్ చూపలేదు.