Page Loader
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్
2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విజయ్ చివరిసారిగా ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 30, 2023
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వెటనర్ క్రికెటర్ మురళీవిజయ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2008లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా అరంగ్రేటం చేసిన విజయ్ చివరి టెస్టును ఆ దేశంపైనే ఆడడం గమనార్హం. 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విజయ్ చివరిసారిగా భారత్ తరపున ఆడాడు. 2015 నుండి వన్డే, టీ20 భారత్ తరుపున విజయ్ కి చోటు దక్కలేదు. గతేడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో ఆడినప్పటి నుండి అంతర్జాతీయ మ్యాచ్ ను విజయ్ ఆడలేదు.

మురళీ విజయ్

అవకాశాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు : మురళీ విజయ్

61 టెస్టు మ్యాచ్ లు ఆడిన మురళీ విజయ్ 38.28 సగటుతో 3,982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు చేశాడు. టీమిండియా తరుపున 17 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడు. ఐపీఎల్ లో 106 మ్యాచ్‌లు ఆడి 2,619 పరుగులు చేశాడు. 2020లో చైన్నై సూపర్ కింగ్స్ తరుపున చివరి సారిగా ఆడాడు. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా తనకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, చెంప్లాస్ట్ సాన్మర్‌‌లకు మురళీ విజయ్ కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న విజయ్.. ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ సోషల్ మీడియాలో ప్రకటన