Champions Trophy: 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్‌పై గ్రూప్ స్టేజ్‌లో విజయం.. ఫైనల్‌లో చేదు అనుభవం!
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దుబాయ్‌లో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు కీలక ఆటగాళ్లు అందరూ దుబాయ్ చేరుకున్నారు.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
టీమిండియా ఫిబ్రవరి 20న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఫైనల్ ఓటమికి ప్రతీకారం?
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.
Details
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు మ్యాచులు
ఆ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌తో భారత్ రెండు సార్లు తలపడ్డింది. గ్రూప్ స్టేజ్‌లో టీమిండియా విజయం సాధించగా, ఫైనల్‌లో మాత్రం పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
గ్రూప్ స్టేజ్‌లో భారత విజయం
గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 124 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 91, విరాట్ కోహ్లి 81, శిఖర్ ధావన్ 68, యువరాజ్ సింగ్ 58 రన్స్ చేసి మెరిశారు.
వర్షం కారణంగా పాకిస్థాన్‌కు లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్ధారించగా, భారత బౌలర్లు రాణించడంతో 33 ఓవర్లలో 164 పరుగులకే పాకిస్థాన్‌ను ఆలౌట్ చేశారు.
ఉమేష్ యాదవ్ 3, హార్దిక్ పాండ్య, జడేజా తలో 2 వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.