Page Loader
2023 వింబుల్డన్ : పురుషుల సింగిల్స్‌లో ఇక వేట మొదలు.. టైటిల్‌ని గెలిచేదెవరో!
వింబుల్డన్‌లో సెమీస్‌కు చేరిన కార్లోస్ అల్కరాజ్

2023 వింబుల్డన్ : పురుషుల సింగిల్స్‌లో ఇక వేట మొదలు.. టైటిల్‌ని గెలిచేదెవరో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2023
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో నలుగురు ప్లేయర్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సెమీ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్, జన్నిక్ సిన్నర్‌తో తలపడనున్నాడు. అదే విధంగా ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్‌తో మూడో సీడ్ డానియల్ మెద్వెదేవ్ పోటీపడనున్నాడు. ఈ నలుగురు ఆటగాళ్లు సెమీస్‌కు ముందు సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం. సెర్బియా ఏస్ జొకోవిచ్ 2023 వింబుల్డన్‌లో ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించాడు. దీంతో వింబుల్డన్‌లో 12సార్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. ఇక 400 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు.

Details

పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ కు చేరిన రోహన్ బోపన్న జోడీ

క్వార్టర్‌ ఫైనల్స్‌లో మెద్వెదెవ్‌ 2 గంటల 58 నిమిషాల్లో 6-4, 1-6, 4-6, 7-6 (7/4), 6-1తో క్రిస్టోఫర్‌ యుబాంక్స్‌ (అమెరికా)పై, అల్‌కరాజ్‌ 7-6 (7/3), 6-4, 6-4తో ఆరో సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌)పై గెలిచారు. దీంతో ఇద్దరూ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్‌ సినెర్‌ (ఇటలీ)తో జొకోవిచ్‌, మెద్వెదెవ్‌తో అల్‌కరాజ్‌ తలపడనున్నారు. ఈ సెమీఫైనల్లో విజేతగా నిలిచిన వారు ఫైనల్లో పోటీపడనున్నారు. ఇక పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)-మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.