Page Loader
2023 వింబుల్డన్: మొదటి రౌండ్‌లో విజయం సాధించిన స్టెఫానోస్ సిట్సిపాస్ 
మొదటి రౌండ్ లో విజయం సాధించిన సిట్సిపాస్

2023 వింబుల్డన్: మొదటి రౌండ్‌లో విజయం సాధించిన స్టెఫానోస్ సిట్సిపాస్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2023
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పురుషుల సింగిల్స్‌లో స్టెఫానోస్ సిట్సిపాస్ మొదటి రౌండ్ లో కి ప్రవేశించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో అతను 3-6, 7-6(1), 6-2, 6-7(5), 7-6(8)తో థిమ్ పై విజయం సాధించాడు. వింబుల్డన్‌లో గొప్ప రికార్డు లేని సిట్సిపాస్ తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు. సిట్సిపాస్ మొదటి సర్వ్‌లో 79శాతం విజయం సాధించగా, రెండో సర్వ్‌లో కూడా 79శాతం విజయాన్ని నమోదు చేశాడు. మంగళవారం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేయడంతో సిట్సిపాస్ ఒక సెట్ వెనుకబడి ఉన్నాడు. సిట్సిపాస్ తన ప్రత్యర్థి థిమ్‌ను ఓడించడానికి మూడు గంటల 55 నిమిషాల సమయం పట్టింది.

Details

ముర్రేతో తలపడనున్న సిట్సిపాస్

సిట్సిపాస్ తర్వాతి మ్యాచులో ముర్రేతో తలపడనున్నాడు. సిట్సిపాస్ గ్రాండ్‌స్లామ్‌లలో తన 54వ విజయాన్ని సాధించడం విశేషం. అతను ఇప్పుడు 54-23 గెలుపు-ఓటముల రికార్డును కలిగి ఉన్నాడు. ముర్రే మొదటి రౌండ్‌లో ర్యాన్ పెనిస్టన్‌ ఓడించిన విషయం తెలిసిందే. 2023లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ రెండింటినీ గెలుచుకున్న జకోవిచ్ జోర్డాన్ థాంప్సన్‌ను వరుస సెట్లలో అధిగమించి సత్తా చాటాడు.