Page Loader
వింబుల్డన్‌లో కార్లోస్ అల్కరాజ్ ముందంజ
సత్తా చాటిన కార్లోస్ అల్కరాజ్

వింబుల్డన్‌లో కార్లోస్ అల్కరాజ్ ముందంజ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2023
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాప్ సీడ్ అల్కరాజ్ వింబుల్డన్‌లో సత్తా చాటాడు. మంగళవారం జరిగిన మొదటి రౌండ్‌లో అతడు 6-0, 6-2, 7-5తో చార్డీ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. మూడో సెట్లో మాత్రమే అల్కరాజ్ కొంచెం పోరాడాల్సి వచ్చింది. ఈ మ్యాచులో అతను పది ఏస్ లు సంధించి, 38 విన్నర్లు కొట్టాడు. చార్డీ ఏకంగా 10 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. ఇక నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా ఈ టోర్నీలో గెలుపొందాడు. మొదటి రౌండ్‌లో అతడు 6-1, 7-5, 4-6, 6-3తో లొకోలి (ఫ్రాన్స్‌)ను చిత్తు చేశాడు. మాజీ నంబర్‌వన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) 6-3, 6-0, 6-1తో పెనిస్టన్‌ (బ్రిటన్‌)ను ఓడించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.

Details

మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కి అర్హత సాధించిన రిబకినా

మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ రిబకినా (కజక్‌స్థాన్) రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మొదటి రౌండ్లో ఆమె 4-6, 6-1, 6-2తో షెల్బీ రోజర్స్‌ (అమెరికా)పై గెలుపొందింది. ఇక ఆరో సీడ్ జాబెర్ (ట్యునీసియా) ఆరంభ పోరులో 6-3, 6-3తో ఫ్రెచ్‌ (పోలెండ్‌)ను మట్టికరిపించింది. ఇంకో మ్యాచ్‌లో సురెంకో (ఉక్రెయిన్‌) 6-3, 3-6, 6-4తో క్లెయిర్‌ లియు (అమెరికా)పై విజయం సాధించింది. మరోవైపు ఏడో సీడ్ కొకో గాఫ్ (అమెరికా) కు ఊహించని షాక్ తగిలింది. ఆమె తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. అమెరికాకు చెందిన కెనిన్‌ 6-4, 4-6, 6-2 చేతిలో గాఫ్‌ ఓడిపోయింది.