Page Loader
2024 ICC Women's T20 World Cup:మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, భారత్ మ్యాచ్‌లు షెడ్యూల్ ఇదే..
మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, భారత్ మ్యాచ్‌లు షెడ్యూల్ ఇదే..

2024 ICC Women's T20 World Cup:మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, భారత్ మ్యాచ్‌లు షెడ్యూల్ ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2024
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి మహిళల టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్‌లో జరగనుంది. ఈ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ అక్టోబర్‌ 3న ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు క్వాలిఫయర్-1తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. భారత్ గ్రూప్‌లో పాకిస్థాన్ ఇక ఈ పది టీమ్స్ ను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A లో క్వాలిఫైయర్ 1 గా సెలెక్ట్ అయిన శ్రీలంక, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్స్ ఉండగా.. గ్రూప్ B లో క్వాలిఫైయర్ 2 గా స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ టీమ్స్ ఉన్నాయి.

Details 

అన్ని గ్రూప్ మ్యాచ్‌లను సిల్హెట్‌లో ఆడనున్న భారత్ 

గతేడాది కేప్‌టౌన్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2020లో ఫైనల్స్‌కు చేరుకోవడంలోఅత్యుత్తమ ప్రదర్శన సాధించింది భారత జట్టు . భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో అక్టోబర్‌ 4న సిల్హెట్‌లో ఆడనుంది.ఇక అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 9న క్వాలిఫయర్-1తో తలపడనుంది. అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. భారత జట్టు తన అన్ని గ్రూప్ మ్యాచ్‌లను సిల్హెట్‌లో ఆడుతుంది. ఈ టోర్నమెంట్‌లో ప్రతి జట్టు నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.

Details 

మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్

అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 20న ఢాకాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓవరాల్‌గా 19 రోజుల్లో 23 మ్యాచ్‌లు ఢాకా, సిల్హెట్‌లలో జరగనున్నాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కూడా ఉంటుంది. అక్టోబర్ 3: ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా, ఢాకా అక్టోబర్ 3: బంగ్లాదేశ్ vs క్వాలిఫయర్ 2, ఢాకా అక్టోబర్ 4: ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్-1, సిల్హెట్ అక్టోబర్ 4: భారత్ vs న్యూజిలాండ్, సిల్హెట్ అక్టోబర్ 5: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, ఢాకా అక్టోబర్ 5: బంగ్లాదేశ్ vs ఇంగ్లండ్, ఢాకా 6 అక్టోబర్: న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 1, సిల్హెట్

Details 

మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్

అక్టోబర్ 6: భారత్ vs పాకిస్థాన్, సిల్హెట్ అక్టోబర్ 7: వెస్టిండీస్ vs క్వాలిఫైయర్ 2, ఢాకా అక్టోబర్ 8: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్, సిల్హెట్ అక్టోబర్ 9: బంగ్లాదేశ్ vs వెస్టిండీస్, ఢాకా 9 అక్టోబర్: భారతదేశం vs క్వాలిఫైయర్-1, సిల్హెట్ అక్టోబర్ 10: దక్షిణాఫ్రికా vs క్వాలిఫైయర్ 2, ఢాకా అక్టోబర్ 11: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, సిల్హెట్ 11 అక్టోబర్: పాకిస్థాన్ vs క్వాలిఫైయర్-1, సిల్హెట్

Details 

మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్

అక్టోబర్ 12: ఇంగ్లండ్ vs వెస్టిండీస్, ఢాకా అక్టోబర్ 12: బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా, ఢాకా అక్టోబర్ 13: పాకిస్థాన్ vs న్యూజిలాండ్, సిల్హెట్ అక్టోబర్ 13: భారత్ vs ఆస్ట్రేలియా, సిల్హెట్ అక్టోబర్ 14: ఇంగ్లాండ్ vs క్వాలిఫైయర్ 2, ఢాకా 17 అక్టోబర్: మొదటి సెమీ-ఫైనల్, సిల్హెట్ 18 అక్టోబర్: రెండవ సెమీ-ఫైనల్, ఢాకా 20 అక్టోబర్: ఫైనల్, ఢాకా