రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న పుజూరా విన్నింగ్ షాట్ ఫోర్ కొట్టడంతో, ఆరు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయ దుందుభి మోగించింది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12.1 ఓవర్లలో 7/42 వికెట్లు తీసిన జడేజా ఆస్ట్రేలియా ఓటమి శాసించాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం పది వికెట్లు తేసీన జడేజా, తన కెరీర్లో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో టీమ్ ఇండియా 2-0 ఆధిక్యంలో ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకున్న భారత్
రెండో ఇన్నింగ్స్‌లో 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్ పడిపోవడంతో ఆరంభంలోనే ఉలిక్కిపడింది. రోహిత్ శర్మ 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం రోహిత్ ఔట్ కావడంతో, పుజూరా.. కేఎస్ భరత్‌తో కలిసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 పరుగులు చేయగా, భారత్ 262 రన్స్ చేసింది. ఒక్క పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జడేజా, అశ్విన్ మాయాజాలానికి 113 పరుగులకే కుప్పకూలిలోయింది. తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ బ్యాంటింగ్‌తో పాటు బౌలింగ్ లోనూ కీలక పాత్ర పోషించాడు. మొత్తం మీద సమిష్టి కృష్టితో భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ నిలబెట్టుకుంది. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా చేరుకుంది.