అర్ధశతకంతో టీమిండియాను అదుకున్న అక్షర్ పటేల్
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీలో అస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్ రౌండర్ అర్ధశతకంతో రాణించాడు. విరాట్‌కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ మొదటి నుండి దూకుడుగా ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీల వర్షం కురిపించాడు.
కుహ్నెమాన్ వేసిన 75 ఓవర్లో సిక్సర్ బాది అర్ధ సెంచరీ పూర్త చేశాడు. అశ్విన్(37) కలిసి ఎనిమిదో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అక్షర్ కేవలం 115 బంతుల్లో 74 పరుగులు చేసి సత్తా చాటాడు. మార్ఫీ వేసిన తర్వాతి ఓవర్‌లో సిక్సర్ బాది జోరు మీద కనిపించిన అక్షర్ పటేల్ కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 262 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆసీస్ 61 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
అక్షర్ పటేల్
సత్తా చాటిన అక్షర్ పటేల్
అక్షర్ టెస్టులో తన మూడో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం టెస్టులో 31.31 సగటుతో 407 పరుగులకు చేశాడు.
నాలుగు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను కోహ్లీ, జడేజా ఆదుకున్నారు. అయితే అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడిని మార్ఫీ విడదీశాడు.
జడేజా (26) ఎల్బీడబ్ల్యూగా కావడంతో.. కాసేపటికే విరాట్ కోహ్లీ (44) ఔటయ్యాడు. అనంతరం శ్రీకర్ భరత్ (6)ను నాథన్ లైయన్ ఔట్ చేశాడు.