టీ20 సిరీస్‌లో.. ముగ్గురు నయా ప్లేయర్లు
టీమిండియాలో ముగ్గురు జూనియర్ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా జట్టు జనవరిలో మూడు వన్డేలు, మూడు టీ20లను స్వదేశంలో శ్రీలంకతో ఆడనుంది. సీనియర్ ఆటగాళ్ల పక్కను పెట్టి జూనియర్ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. టీ20 కెప్టెన్‌గా హార్థిక్, వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు. రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ అధ్బుతంగా రాణిస్తున్న ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అరగేట్రం చేయలేదు. ఐపీఎల్‌లో పుణే సూపర్ జెయింట్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరుపున త్రిపాఠి ఆడాడు. IPLలో మొత్తం 76 మ్యాచ్‌ల్లో 1798 పరుగులు చేశాడు. గత సీజన్లో సన్ రైజర్స్ తరుపున ఆడి.. 413 పరుగులు సాధించాడు. ప్రస్తుతం శ్రీలంక జరిగే టీ20లో ఎంపిక కావడంపై త్రిపాఠి హర్షం వ్యక్తం చేశారు.
ఐపీఎల్‌లో శివంమావికి అద్భుత రికార్డు
2018 జరిగిన U-19 ప్రపంచ కప్ ఇండియా అత్యున్నత ప్రదర్శన కనభరిచిన బౌలర్లలో శివం మావి ఒకరు. IPLలో 32 మ్యాచ్‌లు 30 వికెట్లు పడగొట్టి తీశాడు. ఈ ఏడాది IPL 2023 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.6 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు శివంమావిని ఎంపికయ్యాడు. ముఖేష్ కుమార్ టీ20ల్లో అవకాశం లభించింది. బెంగల్ కు ఈ చెందిన ఈ పేసర్ వేలంలో ధరను రూ.20 లక్షలకు నిర్ణయించగా ఫ్రాంచేజీలు అతని కోసం పోటి పడ్డాయి. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ ముఖేస్ ని రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది రంజీ ట్రోఫిలో ఐదు మ్యాచ్‌ల్లో మొత్తం 20 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.