గబ్బా, మెల్ బోర్న్, నాటింగ్ హామ్ పిచ్‌లకు ఐసీసీ చెత్త రేటింగ్
గబ్బా, మెల్ బోర్న్, నాటింగ్ హామ్ పిచ్ లకు ఐసీసీ చెత్త రేటింగ్ ఇచ్చింది. ఈ పిచ్ లు టెస్టుకు అనుకూలంగా లేనట్లు పేలవమైన రేటింగ్ ఇచ్చింది. గబ్బాలో ఆస్ట్రేలియాలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘోరంగా ఓడిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ తమ ఓటమికి గబ్బా పిచ్‌ను నిందించాడు. గబ్బా పిచ్ ఆటగాళ్లకు సేఫ్ కాదని అన్నారు. పిచ్ విషయంలో అంపైర్లతో మాట్లాడినట్లు ఎల్గర్ తెలిపాడు. ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. 'గబ్బా పిచ్ మీద చాలా గడ్డి ఉంటుంది. దానిని ఎందుకు తొలగించారో నాకు అర్థం కావడం లేదు. పిచ్ చాలా షాకింగ్ గా ఉంది..'అని ట్వీట్ చేశాడు.
'ఈ పిచ్‌లు క్రికెట్‌కు అనుకూలంగా లేవు'
-2017-18 మెల్ బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఐదు రోజుల వ్యవధిలో 24 వికెట్లు పడ్డాయి. అస్ట్రేలియా-ఇంగ్లాడ్ కలిపి 1000 పరుగులకు పైగా స్కోర్ చేశాయి. ఆటను చూడటానికి 250,000 మంది స్టేడియానికి వచ్చారు. అయితే ఈ డ్రాగా ముగిసింది. దీనిపై ఐసిసి మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లె తన అధికారిక నివేదికలో 'పేలవమైన' రేటింగ్ ఇచ్చారు. ఇంగ్లాండ్ vs ఇండియా, 2014 నాటింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో జిమ్మీ అండర్సన్ భారత్‌పై 81 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో జమ్మీ అండర్సన్ నిరుత్సాహానికి గురయ్యాడు. నాటింగ్‌హామ్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, పర్స్‌హౌస్ మాట్లాడుతూ, "పేలవంగా ఉన్న పిచ్‌ను రూపొందించినందుకు మేము సహజంగానే నిరాశ చెందామని ట్విట్ చేశారు.