
Osman Ghani : ఒకే ఓవర్లో 45 పరుగులు.. ఉస్మాన్ ఘనీ నుంచి సంచలన రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ చరిత్రలో మరో సంచలనాత్మక వరల్డ్ రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ టీ10 టోర్నమెంట్‌లో జరిగిన మ్యాచ్‌లో యువ క్రికెటర్లు ఒకే ఓవర్లో 45 పరుగులు రాబట్టి ప్రపంచాన్ని అబ్బురపరిచారు. గిల్‌ఫోర్డ్ వర్సెస్ ఎల్‌ఎల్‌సీ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఎల్‌ఎల్‌సీకి చెందిన బ్యాటర్ ఉస్మాన్ ఘనీ (Osman Ghani) ఈ అసాధారణ రికార్డును నెలకొల్పాడు. గిల్‌ఫోర్డ్ బౌలర్ ఆర్నే వేసిన ఎనిమిదవ ఓవర్‌లో ఘనీ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్‌లో ఐదు సిక్సులు, రెండు ఫోర్లు బాదడమే కాకుండా, రెండు నోబాల్స్, అందులో 7 ఎక్స్ట్రాలు కలిపి ఓవర్లో మొత్తం 45 పరుగులొచ్చాయి. ఇది క్రికెట్ చరిత్రలో ఓ ఓవర్లో వచ్చిన అత్యధిక పరుగులుగా వరల్డ్ రికార్డుగా నమోదైంది.
Details
43 బంతుల్లో 153 పరుగులు
ఉస్మాన్ ఘనీ కేవలం 23 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. మొత్తంగా 43 బంతుల్లో 17 సిక్సులు, 11 ఫోర్లు సాయంతో 153 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఆతిషత్వ బ్యాటింగ్ నేషనల్, అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకే ఓవర్లో 45 పరుగులు రావడం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టంగా గుర్తింపు పొందింది.