NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Indians As Foreign Team Coach: విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయుల గురించి మీకు తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Indians As Foreign Team Coach: విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయుల గురించి మీకు తెలుసా?
    విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయుల గురించి మీకు తెలుసా?

    Indians As Foreign Team Coach: విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయుల గురించి మీకు తెలుసా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 05, 2024
    01:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం ఇప్పటి వరకు అనేక అద్భుతమైన క్రికెటర్లను తయారు చేసింది. వీరిలో చాలామంది క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాక కూడా ఆటతో తమ బంధాన్ని కొనసాగించారు.

    అందులో భాగంగా, భారతదేశానికి చెందిన అనేక మంది మాజీ క్రికెటర్లు విదేశీ జట్లకు కోచ్‌లుగా సేవలందించారు.

    ఆ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు విదేశీ జట్లకు కోచ్‌గా పనిచేసిన భారత మాజీ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.

    వివరాలు 

    విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయులు వీరే..

    సందీప్ పాటిల్: టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్‌ పాటిల్‌ 1983లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. టీమిండియా తరఫున 29టెస్టులు,45వన్డేలు ఆడిన ఆయన, తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కెన్యా జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో కెన్యా జట్టు 2003 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌ చేరి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పసికూనగా భావించిన కెన్యా జట్టు సంచలనం సృష్టించింది.

    లాల్‌ చంద్ రాజ్‌ పుత్: లాల్ చంద్ రాజ్‌ పుత్ భారత్ తరఫున 2టెస్టులు,4వన్డేలు ఆడారు.ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత,ఆయన కోచింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించారు.2016-2017 వరకు అఫ్గానిస్థాన్ జట్టుకు,2018-2022 వరకు జింబాబ్వే జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశారు.ప్రస్తుతం యూఏఈ జట్టుకు కోచ్‌ గా ఉన్నారు.

    వివరాలు 

    విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయులు వీరే..

    రాబిన్ సింగ్: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ సింగ్ భారత తరఫున ఒక టెస్టు, 136 వన్డేలు ఆడారు. 2004లో హాంకాంగ్ జట్టుకు కోచ్‌గా, అలాగే అమెరికా క్రికెట్ జట్టుకు కూడా కోచ్‌గా పనిచేశారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సహా పలు టీ20 లీగ్‌లలో కూడా కోచ్‌గా పనిచేశారు.

    శ్రీధరన్ శ్రీరామ్: టీమిండియా ప్లేయర్ శ్రీధరన్ శ్రీరామ్ భారతదేశం తరఫున 8 వన్డేలు ఆడారు. 2015లో ఆస్ట్రేలియా A జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 2019లో ఆస్ట్రేలియా యాషెష్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

    వివరాలు 

    విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయులు వీరే..

    అజయ్ జడేజా: టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా భారత్ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడారు. రిటైర్మెంట్ తర్వాత అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2023 వరల్డ్ కప్‌లో ఆయన ఆధ్వర్యంలో అఫ్గాన్ జట్టు ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లపై విజయాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    క్రికెట్

    Shardul Thakur: శార్దూల్‌ ఠాకూర్‌ కు అస్వస్థత.. 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్‌ క్రీడలు
    Varun Chakravarthy: రవి బిష్ణోయ్‌తో ఆహ్లాదకరమైన పోటీ.. వరణ్ చక్రవర్తి కీలక ప్రకటన  టీమిండియా
    IPL: ఐపీఎల్ 2025 మెగా వేలం.. కొత్త రిటెన్షన్ నియమాలు, ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి  ఐపీఎల్
    Hong Kong Sixes Tournament: 'హాంకాంగ్ సిక్సెస్' టోర్నమెంట్ నవంబర్ 1 నుంచి.. రూల్స్ ఎలా ఉన్నాయంటే? హాంగ్ కాంగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025