Page Loader
భారీ అంచనాలతో అరంగ్రేట్రం... ఆ తర్వాత అడ్రస్ గల్లంతు..!
రాహుల్ చాహర్

భారీ అంచనాలతో అరంగ్రేట్రం... ఆ తర్వాత అడ్రస్ గల్లంతు..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2022
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాలో చోటు సంపాదించడం చాలా కష్టం.. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చి.. తరువాత చోటు దక్కకపోతే భవిష్యతులో ఆ ప్రభావం ఆటపై పడే అవకాశం ఉంటుంది. 2021లో జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు 2022లో ఇంటర్నేషన్ క్రికెట్ కి దూరంగా ఉండడం గమనార్హం. ప్రధాన లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ T20 ప్రపంచ కప్ 2021లో భారతదేశానికి ఆడాడు. అయితే 2022లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. చాహర్ ఒక మ్యాచ్‌లో మూడు వన్డే వికెట్లు, ఆరు మ్యాచ్‌లలో ఏడు టీ20 వికెట్లు తీశాడు. కానీ రాహుల్‌ చాహర్‌ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోయాడు. 2023లో వరుస అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.

టీమిండియా

పేలవ ప్రదర్శన వల్ల చోటు దక్కలేదు

లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టి.నటరాజన్ ఐపీఎల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 2021లో టెస్టు అరగేట్రం చేసి.. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాపై మూడు వికెట్లు సాధించి.. టీమిండియాలో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా సెలక్టర్లు అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఐపీఎల్‌ 2022లో వెంకట అయ్యర్‌ ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. హార్దిక్ అద్భుతమైన పునరాగమనంతో వెంకటేష్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది శ్రీలంకతో జరిగిన ఎవే సిరీస్‌లో చేతన్ సకారియా భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అశించిన స్థాయిలో రాణించకపోవడంతో చోటు దక్కలేదు. 2021లో శ్రీలంకపై టీ20లలో సందీప్ వారియర్ అరంగేట్రం చేశారు. అయితే మెరుగైన ప్రదర్శన కనబరచకపోవడంతో అతన్ని పక్కన పెట్టారు.