Western Australia: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త ఫీట్.. 52/2 నుండి 53 ఆలౌట్!
క్రికెట్‌లో బౌలర్లపై బ్యాటర్లదే హవా అంటుంటారు. అది తప్పని బౌలర్లు నిరూపిస్తుంటారు. ప్రారంభం అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఒకోసారి క్షణాల్లో కుప్పకూలి కష్టాలను కొనితెచ్చుకుంటాయి కొన్ని టీమ్‌లు. ఆ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అయితే.. అభిమానులభాద వర్ణనాతీతం. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లోనూ ఇలాంటిదే చోటు చేసుకుంది. ఇంతకీ ఏమి జరిగిందంటే?
టాస్మానియా దెబ్బకు 53 పరుగులకే..
ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో వన్డే కప్‌కు (Australia One Day Cup) ఎంతో ప్రాధాన్యత ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు టాస్మానియా జట్టు చుక్కలు చూపించింది. ఆష్టన్ టర్నర్, జోష్ ఇంగ్లిస్, జే రిచర్డ్‌సన్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు కలిగిన వెస్ట్రన్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాస్మానియా దెబ్బకు 53 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆర్కీ షార్ట్ (22) టాప్ స్కోరర్. అతడితోపాటు బాన్‌క్రాఫ్ట్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు .
8.3 ఓవర్లలోనే విజేతగా టాస్మానియా
అట ఒకానొక దశలో 51/2తో మంచి స్థితిలోనే ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా టాస్మానియా బౌలర్ల ధాటికి కేవలం రెండు పరుగుల్లోపే మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు. మరీ ముఖ్యంగా ఆ జట్టులో వరుసగా ఆరుగురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. టాస్మానియా బౌలర్లలో వెబ్‌స్టర్ కేవలం 17 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.స్టాన్‌లేక్ (3/12), టామ్ రోజెర్స్ (1/12) సహకారం అందించారు. అనంతరం లక్ష్య ఛేదనలో టాస్మానియా 3 వికెట్లను కోల్పోయి 8.3 ఓవర్లలోనే విజేతగా నిలిచింది. మిచెల్ ఓవెన్ (29), మాథ్యూ వేడ్ (21) రాణించారు.