Page Loader
Aarit kapil: మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాక్ ఇచ్చిన తొమ్మిదేళ్ల ఆరిత్‌ 
మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాక్ ఇచ్చిన తొమ్మిదేళ్ల ఆరిత్‌

Aarit kapil: మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాక్ ఇచ్చిన తొమ్మిదేళ్ల ఆరిత్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచపు నంబర్‌వన్ చెస్‌ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ (నార్వే)ను ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఆరిత్‌ కపిల్‌ షాక్ ఇచ్చాడు. ఎర్లీ టైటిల్డ్‌ ట్యూస్డే' పేరుతో జరిగిన ఆన్‌లైన్ చెస్‌ టోర్నమెంట్‌లో కార్ల్‌సన్‌తో పోరాడిన ఆరిత్‌ — అతనిని ఓడించే స్థాయికి చేరుకొని చివరకు మ్యాచ్‌ను డ్రా చేసాడు. ఇటీవల జరిగిన జాతీయ అండర్‌-9 ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానాన్ని అందుకున్న ఆరిత్‌, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కార్ల్‌సన్‌తో తలపడి గేమ్‌ను సమంగా ముగించాడు.

వివరాలు 

టోర్నీలో ప్రణవ్‌ విజేత

అయితే మ్యాచ్‌ చివరలో టైమర్‌లో కేవలం కొన్ని సెకనులే మిగలడంతో తన ఆధిపత్యాన్ని విజయంగా మార్చుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌ను ఆరిత్‌ జార్జియాలోని తన హోటల్‌ నుంచి ఆడాడు. టోర్నీలో ప్రణవ్‌ మొత్తం 10 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. కార్ల్‌సన్‌, అమెరికాకు చెందిన హాన్స్ మోక్ నీమాన్‌ ఇద్దరూ 9.5 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ, టైబ్రేక్‌ పద్ధతిలో నీమాన్‌కు రెండో స్థానంలో నిలిచే అవకాశం దక్కింది.