ధోనిపై అభిమానంపై చాటుకున్న బిగ్ ఫ్యాన్.. 2400 కిలోమీటర్లు సైక్లింగ్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కొన్ని కోట్లమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఎంతమంది అభిమానులు ఉన్నారో కచ్చితంగా లెక్కచెప్పడం కష్టం కానీ.. ఎలాంటి అభిమానులు ఉన్నారు? వారి అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ఈ విషయంతో ఊహించే అవకాశం ఉంటుంది.
కెప్టెన్ గా భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని.. భారత్ క్రికెట్ చరిత్రలో అత్యత్తుమ కెప్టన్లలో ఒకడిగా ఉన్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా ధోని క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు.
ఈ క్రమంలోని ధోని కోసం ఓ అభిమాని ఏకంగా 2400 కిలోమీటర్లు సైక్లింగ్ చేసుకుంటూ ఢిల్లీ నుంచి పయనమయ్యాడు. ఢిల్లీ యూనివర్సటీలో ఫ్యాకల్టీగా చేస్తున్న తనేజాకు ధోని అంటే చచ్చేంత ఇష్టం.
Details
తనేజాను మెచ్చుకుంటున్న ధోని ఫ్యాన్స్
'దేశ్ కా ధోని' అనే క్యాంపెయిన్ తో చైన్నైలో ధోనిని కలిసేందుకు ఢిల్లీ నుంచి తనజా సైక్లింగ్ చేసుకుంటూ బయలుదేరాడు.
ఇది విన్న అభిమానులు ఓ యూనివర్సటీలో ఫాకల్టీగా చేస్తున్న వ్యక్తి ధోనిపై ఇంతలా అభిమానం చూపించడం అద్భుతమని, తనేజా చాలా గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. చైన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తనేజా చివరిసారిగా అయినా ధోనిని చెపాక్ మైదానంలో చూసేందుకు ఆరాటపడుతున్నారని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.