Page Loader
AUS vs IND: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. టెస్ట్ సిరీస్‌కి స్టార్ ఆల్ రౌండర్ గ్రీన్ దూరం
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. టెస్ట్ సిరీస్‌కి స్టార్ ఆల్ రౌండర్ గ్రీన్ దూరం

AUS vs IND: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. టెస్ట్ సిరీస్‌కి స్టార్ ఆల్ రౌండర్ గ్రీన్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2024
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాకు జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు కామెరూన్ గ్రీన్ భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను నవంబర్ మూడో వారంలో ఆడనుంది. ఇది దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కావడం గమనార్హం. క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన ప్రకటన ప్రకారం, గ్రీన్‌ను వెన్ను నొప్పి కోసం శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Details

గ్రీన్ కు శస్త్ర చికిత్స అవసరం

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సమయంలో గ్రీన్ వెన్నునొప్పితో బాధపడుతూ స్వదేశానికి తిరిగొచ్చారు. పేస్ బౌలర్లకు వెన్నెముకలో పగుళ్లు సాధారణమైన విషయమని, కానీ గ్రీన్‌కు ఇది తీవ్రమైన గాయం కావచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. వైద్య నిపుణుల పరిశీలన తర్వాత శస్త్రచికిత్స అవసరమని తేలిందని, భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు శస్త్రచికిత్స చేయించుకోవడం మంచిదని వారు అన్నారు. ఇప్పుడే గ్రీన్ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆసీస్ పిచ్‌లపై గ్రీన్ లేకపోవడం జట్టుకు ఒక నష్టంగా భావిస్తున్నారు. భారతదేశానికి చెందిన ఈ ఆస్ట్రేలియా పర్యటన దాదాపు నెలన్నర పాటు సాగనుంది. ఇది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడవ సీజన్‌లో రెండు జట్ల మధ్య జరిగే కీలక సిరీస్.

Details

 టెస్టుల షెడ్యూల్ ఇదే

మొదటి టెస్టు: నవంబర్ 22 - 26 (పెర్త్) రెండవ టెస్టు: డిసెంబర్ 6 - 10 (అడిలైడ్) మూడవ టెస్టు: డిసెంబర్ 14 - 18 (బ్రిస్బేన్) నాలుగవ టెస్టు : డిసెంబర్ 26 - 30 (మెల్‌బోర్న్) ఐదవ టెస్టు : 2025 జనవరి 3 - 7 (సిడ్నీ) ఈ సిరీస్‌పై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొని ఉంది. కానీ ఇరు జట్ల స్క్వాడ్‌లను ఇంకా ప్రకటించలేదు.