Abhishek Sharma: పవర్ ప్లేలో గేమ్ ఛేంజర్.. ఆ పేరు వింటే బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
యువ క్రికెటర్ అభిషేక్ శర్మ క్రీజులో అడుగుపెట్టాడంటే స్కోరు పరుగులు పెట్టాల్సిందే. పవర్ ప్లే పూర్తయ్యేలోగా జట్టు స్కోరు 100 దాటిస్తాడంటే అతని ఆటతీరు అర్థం చేసుకోవచ్చు.
క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచి అతడి బ్యాట్ నుంచి వరుసగా సిక్సర్లు, ఫోర్లు విరుచుకుపడతాడు. గురువు యువరాజ్ సింగ్ పూనాడన్నట్లు, బౌలర్ బంతిని వేసిన క్షణంలోనే సిక్సర్ బాదేస్తాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా అదిరిపోయే ఆరంభాన్ని అందిస్తూ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న అభిషేక్ శర్మను ఫ్రాంచైజీ వేలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేదు.
నిలకడగా పరుగులు చేయడం, ఒంటిచేత్తో మ్యాచ్‌ను తనవైపుకు తిప్పేయగలిగే సత్తాతో పాటు ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఆటను కొనసాగించగలడు.
ఈ సీజన్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
Details
రికార్డుల మీద రికార్డులు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు నెలకొల్పాడు.
2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 126 పరుగులతో అజేయంగా నిలవగా, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 135 పరుగులు చేసి తనదైన ముద్ర వేశాడు.
అంతేకాదు టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు.
2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్‌మ్యాన్ 10 సిక్సర్లు బాదగా, తాజాగా అభిషేక్ 13 సిక్సర్లు బాది కొత్త రికార్డు నెలకొల్పాడు.
Details
అభిషేక్ శర్మ గణాంకాలు
అంతర్జాతీయ టీ20ల్లో 17 మ్యాచుల్లో 193.84 స్ట్రైక్ రేట్‌తో 535 పరుగులు చేశాడు.
ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో 63 మ్యాచుల్లో 25.50 సగటుతో 1377 పరుగులు బాదాడు. ఐపీఎల్ సీజన్లో 128 ఫోర్లు, 73 సిక్సర్లు కొట్టాడు.
గత సీజన్‌లో SRH తరఫున 16 మ్యాచుల్లో 204.22 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేయడం విశేషం.
అంతేకాదు, అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 11 వికెట్లు తీసిన అనుభవం కూడా ఉంది.
Details
ఈ సీజన్‌లో సెంచరీనే లక్ష్యం
అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ, ఇప్పటివరకు ఐపీఎల్‌లో మాత్రం సెంచరీ చేయలేదు.
ఈ సీజన్‌లో ఆ ముచ్చట తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.
ఇప్పటికే పాయింట్ టేబుల్‌లో SRH బలంగా నిలవడానికి అభిషేక్ కీలకంగా మారాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ మరెన్నో రికార్డులను తిరగరాయడం ఖాయం!