Page Loader
BCCI: దేశీయ క్రికెట్‌ కోసం కీలక అడుగు.. బీసీసీఐ నూతన నిర్ణయాలివే!
దేశీయ క్రికెట్‌ కోసం కీలక అడుగు.. బీసీసీఐ నూతన నిర్ణయాలివే!

BCCI: దేశీయ క్రికెట్‌ కోసం కీలక అడుగు.. బీసీసీఐ నూతన నిర్ణయాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీసీసీఐ (BCCI) దేశీయ క్రికెట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2025-26 సీజన్‌కు సంబంధించి కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టింది. శనివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాల్లో తాజా ఫార్మాట్లు, నిబంధనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో తొలిసారిగా "సూపర్ లీగ్" దశను ప్రవేశపెట్టారు.

Details

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 'సూపర్ లీగ్' దశ

ఇప్పటివరకు లీగ్ దశ అనంతరం నేరుగా నాకౌట్ మ్యాచ్‌లు ఉండేవి. అయితే తాజా మార్పుతో గ్రూప్ దశలో అర్హత పొందిన ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా (A, B) విభజిస్తారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగిలిన మూడు జట్లతో తలపడుతుంది. ఈ సూపర్ లీగ్‌లో గ్రూప్‌ల టాప్ జట్లు నేరుగా ఫైనల్‌కు చేరతాయి. ఇది మరింత పోటీకి దోహదం చేస్తుందని బీసీసీఐ భావిస్తోంది

Details

ఇతర కీలక మార్పులు

రంజీ ట్రోఫీ ప్రమోషన్/రీలెగేషన్ : ఇకపై 'ఎలైట్', 'ప్లేట్' గ్రూపుల మధ్య కేవలం ఒక జట్టుకే ప్రమోషన్ లేదా రీలెగేషన్ అవకాశం ఉంటుంది. ఇది అన్ని వయసుల రెడ్ బాల్ టోర్నీలకు వర్తిస్తుంది. నాణ్యతను నిలబెట్టేందుకు ఈ మార్పు కీలకమని బీసీసీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్లేట్ డివిజన్ పునరుద్ధరణ వన్డే టోర్నీలతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ప్లేట్ గ్రూప్‌ను తిరిగి తీసుకొచ్చారు. గత సీజన్‌లో దిగువ ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఇందులో పోటీ పడతాయి.

Details

నెట్ రన్ రేట్ ప్రాముఖ్యత

ఇకపై సమాన పాయింట్లు ఉన్న సందర్భాల్లో హెడ్-టు-హెడ్ రికార్డు బదులుగా నెట్ రన్ రేట్ (NRR) ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. ఇది అన్ని వైట్ బాల్ టోర్నీలకు వర్తిస్తుంది దులీప్ ట్రోఫీకి జోనల్ ఫార్మాట్ దులీప్ ట్రోఫీ తిరిగి జోనల్ ఫార్మాట్‌కు మారనుంది. జోనల్ సెలెక్షన్ కమిటీల ద్వారానే జట్లు ఎంపిక చేస్తారు. కొత్త గ్రూపింగ్ ఫార్మాట్‌లు విజయ్ హజారే ట్రోఫీ, సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ, అండర్-23 స్టేట్ 'ఎ' ట్రోఫీల్లో "4 ఎలైట్ + 1 ప్లేట్" మోడల్‌ను అనుసరిస్తారు.

Details

నూతన నిర్ణయాలు ఇవే

జూనియర్ మహిళల టోర్నీల్లో "5 ఎలైట్ + 1 ప్లేట్" గ్రూప్ పద్ధతిని పాటించనున్నారు. ఈ మార్పుల ద్వారా దేశీయ క్రికెట్‌కు కొత్త ఊపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆటగాళ్ల నైపుణ్యాలు మెరుగయ్యేలా, పోటీ పటిష్టంగా మారేలా ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయని బీసీసీఐ ఆశిస్తోంది.