Loading...
IPL 2027: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. వచ్చే సీజన్‌కు ట్రావిస్ హెడ్ దూరం!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. వచ్చే సీజన్‌కు ట్రావిస్ హెడ్ దూరం!

IPL 2027: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. వచ్చే సీజన్‌కు ట్రావిస్ హెడ్ దూరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెనింగ్ జోడీ 'ట్రావిషేక్' (ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ) వచ్చే సీజన్‌లో కనిపించనుంది. అయితే ఈ జోడీలో ఒకరైన ట్రావిస్ హెడ్ ఐపీఎల్‌ 2027కు దూరం కానున్నాడు. బిజీగా సాగనున్న అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ నేపథ్యంలో తన పనిభారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న ఆయన.. వచ్చే సీజన్‌లో ఆడలేనని ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది.

వివరాలు

హెడ్‌ దూరం.. ఎస్‌ఆర్‌హెచ్‌కు పెరగనున్న వేలం పర్స్

ట్రావిస్ హెడ్ అందుబాటులో లేకపోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

అయితే అతడు జట్టు నుంచి వైదొలగడంతో డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్‌ 2027 మినీ వేలంలో ఫ్రాంచైజీకి భారీ మొత్తం అందుబాటులోకి రానుంది.

2025 మెగా వేలానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్ చేసుకున్న ఐదుగురు క్యాప్డ్ ఆటగాళ్లలో హెడ్ కూడా ఉన్నాడు. అతడిని రూ.14 కోట్లకు జట్టు అట్టిపెట్టుకుంది.

ఐపీఎల్‌ అధికారికంగా అతడి విడుదలకు ఆమోదం తెలిపిన తర్వాత.. ఆ రూ.14 కోట్లు హైదరాబాద్ వేలం పర్స్‌కు జమ కానున్నాయి.

వివరాలు

ఆటగాళ్లను ఉంచుకోవడంపై నేటితో గడువు

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు సంబంధించి ఏ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలి, ఎవరిని విడుదల చేయాలనే నిర్ణయాలు తీసుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలకు నవంబర్ 17, మంగళవారం చివరి గడువు.

2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాడిని ఒక ఫ్రాంచైజీ విడుదల చేసినా, మరో జట్టుకు ట్రేడ్ చేసినా.. అప్పట్లో నిర్ణయించిన రిటెన్షన్ స్లాబ్‌ల ప్రకారమే ఆ జట్టు వేలం పర్స్‌లో మార్పులు చేస్తారు.

ADVERTISEMENT

వివరాలు

మిగతా ఆటగాళ్ల విషయంలో మార్పుల్లేవు

సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయంలో హెడ్ విడుదల కారణంగా రూ.14 కోట్లు వేలం పర్స్‌కు అదనంగా చేరనున్నాయి. మిగిలిన ఆటగాళ్ల రిటెన్షన్‌ మొత్తాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

మెగా వేలానికి ముందు నలుగురు క్యాప్డ్ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి నిర్ణయించిన మొత్తం రూ.61 కోట్లు. హైదరాబాద్ జట్టు అట్టిపెట్టుకున్న మిగతా నలుగురి జీతాల మొత్తం కూడా అంతే. హెన్రిచ్ క్లాసెన్‌కు రూ.23 కోట్లు, పాట్ కమిన్స్‌కు రూ.18 కోట్లు, అభిషేక్ శర్మకు రూ.14 కోట్లు, నితీశ్ కుమార్ రెడ్డికి రూ.6 కోట్లు చొప్పున చెల్లిస్తోంది.

ఈ నాలుగు మొత్తాల కలిపిన విలువ రూ.61 కోట్లు కావడంతో హెడ్ విడుదల మినహా వేలం పర్స్‌లో ఇతర మార్పులుండవు.

ADVERTISEMENT