LOADING...
ENG vs IND : గిల్ లీడర్‌షిప్‌లో కొత్త అధ్యాయం.. ఒక్క మాటతో టీమిండియాను రేసులోకి తెచ్చాడు!
గిల్ లీడర్‌షిప్‌లో కొత్త అధ్యాయం.. ఒక్క మాటతో టీమిండియాను రేసులోకి తెచ్చాడు!

ENG vs IND : గిల్ లీడర్‌షిప్‌లో కొత్త అధ్యాయం.. ఒక్క మాటతో టీమిండియాను రేసులోకి తెచ్చాడు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓవల్ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు ఉత్కంఠభరిత క్లైమాక్స్‌కు చేరుకుంది. ఐదు రోజుల మ్యాచ్‌లో చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా, ఇంగ్లండ్ విజయం సాధించాలంటే మరో 35 పరుగులు అవసరం. అదే సమయంలో టీమిండియా విజయం కోసం ఇంగ్లాండ్ చివరి నాలుగు వికెట్లు తీస్తే సరిపోతుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలు సాధించిమ్యాచ్‌ను తమ వైపునకు తిప్పినట్టే కనిపించింది. అయితే ఈ దశలో భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. 'ఇంకో గంట కష్టపడదాం..ఆ తరువాత అందరంకలిసి రిలాక్స్ అవుదామని సహచరులను ఉత్సాహపరిచిన గిల్ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి.

Details

వోక్స్ బ్యాటింగ్ కి రాకపోవచ్చు

ఆ మాటల తర్వాత అద్భుతమైన మార్పు చోటుచేసుకుంది. భారత్ జట్టు వేగంగా పుంజుకొని సెంచరీ చేసిన బ్రూక్‌, రూట్‌ వికెట్లు పడగొట్టడంతో పాటు బెత్నేల్‌ను కూడా అవుట్ చేసి మ్యాచ్‌ను తిరగరాసింది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్ క్రమంలో జలదరించిన ఆత్మవిశ్వాసం బద్దలవగా భారత బౌలర్లు మరింత ఉత్సాహంగా బౌలింగ్ చేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. క్రీజులో జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) నిలిచారు. గాయం కారణంగా వోక్స్ బ్యాటింగ్‌కి రాకపోవచ్చు, ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లోనూ అతడు ఆడలేదు. ఈ నేపథ్యంలో తభారత్ మిగిలిన మూడు వికెట్లు పడగొడితే సిరీస్‌ను సమం చేయవచ్చు.