ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి అరుదైన గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
లియోనల్ మెస్సీ.. ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాల్లో కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. ఎందకంటే అతడు సాధించిన ఘనతలకే అందుకు కారణం.
36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్‌ను లియోనల్ మెస్సీ అందించాడు. వరల్డ్ కప్ సాధించినప్పటి నుంచి మెస్సీ పేరు ఏదో ఒక చోటు మారుమ్రోగుతూనే ఉంది.
తాజాగా సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ కౌన్సిల్ మెస్సీకి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ హెడ్‌క్వార్టర్స్ అయిన కాన్‌మిబోల్‌లోని మ్యూజియంలో మెస్సీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది.
దీంతో ఫుట్‌బాల్ దిగ్గజాలుగా పేరు పొందిన డీగో మారడోనా, పీల్ తర్వాత కాన్‌మిబోల్ మ్యూజియంలో ఈ గౌరవం అందుకున్న మూడో ఆటగాడిగా మెస్సీ రికార్డుకెక్కాడు.
మెస్సీ
800 గోల్స్ చేసి సత్తా చాటిన లియోనల్ మెస్సీ
అర్జెంటీనాకు మూడోసారి ట్రోఫీనందించిన మెస్సీ.. ఆ టోర్నిలో ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును గెలుచుకున్నాడు.
ఇటీవలే బ్యూనస్ ఎయిర్స్ లో పనామాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా మెస్సీ ఒక గోల్ చేశాడు. దీంతో 800 గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు.
అర్జెంటీనా తరుపున 99వ గోల్స్ సాధించిన మెస్సీ వంద గోల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
అర్జెంటీనాకు ఫీఫా వరల్డ్ కప్ ను అందించందుకు మ్యూజియంలో అతని మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించామని గవర్నింగ్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లియోనల్ మెస్సీ మైనపు విగ్రహం
Statue for the best player in history. #Messi 🐐🇦🇷pic.twitter.com/BrW2XqShh8
— Leo #Messi 🐐 (@LeoCuccittini_) March 27, 2023